-ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హెచ్ బీ కాలనీ లోనీ 350 ,450 ఎస్.ఎఫ్. టి బ్లాకుల వద్ద గత 15 రోజులుగా తలెత్తిన తాగునీటి సమస్యను త్వరితగతిన పరిష్కరించి త్రాగునీటిని అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ సంబంధిత అధికారులకు తెలిపారు .కాలనీలోని తాగునీటి సంప్ వద్ద తలెత్తిన సమస్యను కూటమి నేతలు ప్రత్తిపాటి శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లడంతో సోమవారం సంప్ వద్దకు వెళ్ళి అక్కడ జరుగుతున్న మరమ్మతులను గురించి ఆయన ఆరా తీశారు. విద్యుత్ మోటార్ లో తలెత్తిన సమస్య వలన ప్రెజర్ అందక ప్రధాన పైపుకు నీటి ప్రవాహం తగ్గటంతో ఇబ్బందులు ఎదురయ్యాయని సమస్యను పరిష్కరిస్తున్నామని వాటర్ వర్క్స్ ఇన్స్పెక్టర్ కాజా వివరించారు. మోటార్ లో తలెత్తిన సమస్యలను త్వరితగతన పరిష్కరించి త్రాగునీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రత్తిపాటి శ్రీధర్ కోరారు. ఎన్డీఏ కూటమి నేతలు యేదుపాటి రామయ్య, సీత చంద్రశేఖర్, పచ్చవ మల్లికార్జున, బ్రహ్మారెడ్డి, సుజనా మిత్ర కోఆర్డినేటర్లు ఫణీంద్ర, కొల్లి దుర్గారావు ఉన్నారు.
Prajavartha Online Telugu News