రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల కాలేజీ సమీపంలో కాతేరు ప్రాంతంలో ప్రమాదాలు నివారించేందుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయడం జరిగిందని ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్ తెలియ చేశారు. నాలుగో వంతెన వద్ద ఉన్న ప్రమాద మలుపు కారణంగా ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు, సంబంధించి క్షేత్ర స్థాయిలో ఇబ్బందులపై పలువురు సామాజిక బాధ్యత కింద తన దృష్టికి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని రావడం జరిగిందనీ తెలిపారు. ఈ క్రమంలో స్వయంగా క్షేత్ర స్థాయిలో తనిఖీలు చెయ్యడం, హెచ్చరికల సూచికలు ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు.
Prajavartha Online Telugu News