Breaking News

జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ని సందర్శించిన మునిసిపల్ పరిపాలన,పట్టణాభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఐఏఎస్ 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నాయుడుపేటలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ని పరిశీలించేందుకు రానున్న తరుణంలో సోమవారం మునిసిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఐఏఎస్, సిడిఎంఏ డాక్టర్ సంపత్ కుమార్ ఐఏఎస్, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ప్లాంట్ ని పరిశీలించారు.
ఈ సందర్భంగా తొలుత ప్లాంట్ సామర్ధ్యం, పనితీరు, అవసరమైన వ్యర్ధాలు, ఏ మున్సిపాల్టీల నుండి ఎంత చెత్త వస్తుంది, ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది తదితర వివరాలను జిందాల్ ఏపి ప్రాజెక్ట్స్ ప్రెసిడెంట్ ఎంవి.చారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
ప్రిన్సిపల్ సెక్రెటరి జిందాల్ ప్లాంట్ లోని టిప్పింగ్ ఫ్లోర్, గ్రాప్ కంట్రోల్ రూమ్, బాయిలర్స్, ప్లూ గ్యాస్ క్లీనింగ్ సిస్టం, సిబ్బంది, డీసిఎస్ కంట్రోల్ రూమ్ లు, వాటి పనితీరును అడిగి తెలుసుకొని, ముఖ్యమంత్రి పర్యటనకు ప్లాంట్ కెపాసిటి, ప్రస్తుతం వస్తున్న వ్యర్ధాలు, పంపుతున్న మునిసిపాలిటీలు, రోజువారీ విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, వ్యర్ధాల నిర్వహణ వంటి సమగ్ర వివరాలతో డాక్యుమెంట్ సిద్దం చేయాలన్నారు. అలాగే జిఎంసి నుండి చేపట్టాల్సిన పారిశుధ్య పనులను పిన్ పాయింట్ గా సిబ్బందిని కేటాయించాలని కమిషనర్ ని ఆదేశించారు.
పర్యటనలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్ డి.శ్రీనివాసరావు, ఉపా సెల్ పిఓ రామారావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *