Breaking News

యోగాపై అవగాహన ర్యాలీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
యోగాని ప్రతి ఒక్కరూ జీవనవిధానంలో భాగం చేసుకుంటే మెరుగైన ఆరోగ్యాన్ని పొందడానికి వీలుంటుందని ప్రత్తిపాడు శాసన సభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యోగాంధ్ర 2025లో భాగంగా జిల్లా కలెక్టరేట్ నుండి నగరంపాలెం 3 బొమ్మల సెంటర్ వరకు యోగాపై అవగాహన ర్యాలీ జరిగింది.
ఈ సందర్భంగా శాసన సభ్యులు డాక్టర్ రామాంజనేయులు  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మే 21 నుండి జూన్ 21 వరకు రాష్ట్రంలో షుమారు 1 కోటి మందికి యోగాని పరిచయం చేయడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపడుతుందన్నారు. 2047 విజన్ లో భాగంగా రాష్ట్రంలో ప్రజల ఆయుప్రమాణం 70 నుండి 85 ఏళ్లకు పెంచే ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నారని, అందుకు యోగా తోడ్పడుతుందన్నారు. దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం పని ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఉండడానికి యోగానే కారణమన్నారు. విద్యా శాఖ మంత్రి లోకేష్ తో చర్చించి ప్రతి స్కూల్ ల్లో యోగా టీచర్ ని నియమించేలా కృషి చేస్తామని తెలిపారు.
ఏపిఐడిసి చైర్మన్ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఆరోగ్యమే కీలకమని, ప్రస్తుతం ప్రజలెదుర్కొంటున్న అనేక ఆరోగ్య రుగ్మతలను యోగా ద్వారా తగ్గించుకోవచ్చన్నారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025ని ప్రకటించిందని పేర్కొన్నారు.
నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ షేక్ సజిలా  మాట్లాడుతూ యోగాని జీవితంలో భాగం చేసుకుంటే అనారోగ్యాల నుండి తప్పించుకోవచ్చని తెలియచేయడానికే నెల రోజులపాటు ప్రభుత్వం యోగాపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, బయలాజిస్ట్ రామారావు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *