Breaking News

అసభ్య పదజాలంతో దూషించిన వారిని వెంటనే అరెస్టు చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త
సాక్షి చానల్‌లో రాజధాని అమరావతి మహిళలై అసభ్య పదజాలంతో దూషించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ విజయవాడ ఆటోనగర్‌లోని సాక్షి పేపర్ కార్యాలయాన్ని ఉమ్మడి కృష్ణాజిల్లా తెలుగు మహిళల ఆధ్వర్యంలో ముట్టడించి తమ నిరసనను తెలిపారు.

ఈ సందర్భంగా మాజీ జడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ తల్లిలాంటి అమరావతిని కించపరస్తూ అమరావతి మహిళలపై సాక్షి చానల్‌లో రిపోర్టర్ కృష్ణంరాజు, కొమ్మినేని వ్యాఖ్యల్ని ఖండిస్తూ వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధానిపై దుష్ప్రచార దాడి చేయించినందుకు, మహిళల శీల హననం చేయించినందుకు జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

కృష్ణాజిల్లా తెలుగు మహిళా అద్యక్షురాలు తలశిల స్వర్ణలత మాట్లాడుతూ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావులను వెంటనే అరెస్టు చేయాలి, సాక్షి చానల్‌ను వెంటనే మూసివేయాలి, మహిళల్ని వేశ్యలుగా మాట్లాడిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని మహిళలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేనిపక్షంలో మహిళలందరూ చెప్పులతో బుద్ధి చెబుతారని హెచచరించారు.

ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి మాట్లాడుతూ ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని వేశ్యల రాజధాని అని సాక్షి డిబేట్‌లో రిపోర్టర్ కృష్ణంరాజు ఆడబిడ్డలను అవమానించారు. సాక్షిలో 5 కోట్ల మంది భవిష్యత్తుతో ముడిపడిన రాష్ట్ర రాజధాని విషయంలో ఇదే విధంగా విషం చిమ్ముతూనే ఉన్నారు. సాక్షి డిబేట్‌లో జర్నలిస్టుల ముసుగులో ఉన్న సంస్కారహీనులు, కిరాయి బ్యాచ్ మహిళలను కించపరుస్తూ నీచపు వ్యాఖ్యలను చేయడాన్ని ఖండించారు.

ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్. ఆషా, యార్లగడ్డ సుచిత్ర, మాదాల రాజ్యలక్ష్మి, మూల్పూరి కళ్యాణి, తెలుగు మహిళా పార్లమెంట్ కమిటీ సభ్యులు మల్లంపాటి విజయలక్ష్మి, మేడసాని రత్నకుమారి, మైనేని ఇందిర, కొనసాని నాగమణి, దాసరి ఉదయశ్రీ, దండమూరి సాయిసుధ, బొప్పన లావణ్య, రాయి రంగమ్మ, అంకెం ఇందిర, మాలంపాటి కళ్యాణి, దండమూరి లక్ష్మి, నీరుకొండ శేషుకుమారి మరియు ఉమ్మడి కృష్ణాజిల్లా తెలుగు మహిళలు భారీగా పాల్గొన్నారు.

కుమ్మరి-శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి చెన్నుపాటి గాంధి, కార్పొరేటర్లు ముమ్మనేని ప్రసాద్, టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ సాయి, నాయకులు పువ్వాడ సుధాకర్, డివిజన్ అధ్యక్షులు గద్దె ప్రసాద్, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర నాయకులు రేపాకుల శ్రీనివాస్, నాయకులు పామర్తి కిషోర్ బాబు,కోడూరు ఆంజనేయ వాసు మరియు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *