-నెల్లూరు జిల్లాలో అత్యధికంగా హాజరు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మెగా డీఎస్సీలో భాగంగా ఆరో రోజు నిర్వహించిన గణితం పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 39048 అభ్యర్థులకు గాను 35862 (91.84%) మంది హాజరయ్యారని మెగా డీఎస్సీ – 2025 కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 117 పరీక్షా కేంద్రాల్లో జరిగిన స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజ్) గణితం పరీక్షకు 21825 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 20254 (92.80%)మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 92 కేంద్రాల్లో జరిగిన స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజ్) గణితం, కన్నడ, ఒడియా, తమిళం, ఉర్దూ మాధ్యమాల్లో గణిత బోధనకు దరఖాస్తు చేసుకున్న 17223 అభ్యర్థుల్లో 15608 (90.62%) మంది హాజరయ్యారని మెగా డీఎస్సీ – 2025 కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి తెలిపారు. రెండు పూటల జరిగిన పరీక్షల్లో నెల్లూరు జిల్లా నుంచి అత్యధికంగా హాజరైనట్లు పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News