Breaking News

రైతులకు అన్నదాత సుఖీభవ , పి.యం.కిసాన్ పథకం అమలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ , పి.యం.కిసాన్ పథకం అమలు చేయుటకు సిద్ధమైనది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి 20 వేల రూపాయలు 3 విడతలలో ఆర్థిక సహాయం అందజేయనుంది. తిరుపతి జిల్లాలో 145360 రైతు కుటుంబాలను ప్రభుత్వం ఈ పథకానికి అర్హులుగా గుర్తించడం జరిగింది. అర్హులైన వారి జాబితా ఆయా రైతు సేవా కేంద్రాల సిబ్బంది వద్ద అందుబాటులో ఉంటుంది. కావున రైతులు వారికి సంబంధించిన రైతు సేవా కేంద్రాల సిబ్బందిని సంప్రదించి 20 జూన్ 2025 లోపు ఈ కె.వై.సి పూర్తి చేసుకోవాలని, ఈ కె.వై.సి పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధిoచిన నగదు బ్యాంకు ఖాతాలలో జమ చేయటం జరుగుతుందని, జిల్లాలో ఇప్పటికే 3180 మంది రైతులు ఈ కే వై సి పూర్తి చేసుకున్నారని జిల్లా వ్యవసాయ అధికారి యస్. ప్రసాద రావు  తెలియజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *