విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్వర్ణాంధ్ర @ 2047 దార్శనిక ప్రణాళికలో భాగంగా ఏర్పాటుచేసిన ఇగ్నైట్ సెల్‌ను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను అధికారులు వివరించారు. ప్రీ స్కూల్, బాల అలెర్ట్, బాల సంజీవిని కిట్, గ్రోత్ మానిటరింగ్, గుడ్లు పాలు, టీహెచ్ఆర్, పోషణ వాటిక తదితర కార్యక్రమాల గురించి వివరించారు. అదేవిధంగా వన్ స్టాప్ సెంటర్, దత్తత, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవోలు భానుమతి, జ్యోత్స్న, డీసీపీవో ఎం. రాజేశ్వరరావు, దుర్గా భవాని, జాన్సన్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News