Breaking News

యువతీ యువకులు జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోండి…

వెంకటగిరి (విశ్వోదయ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల), నేటి పత్రిక ప్రజావార్త :
వెంకటగిరి నియోజకవర్గo లో ఉన్న యువతీ యువకులు జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోండి అని కోరుగండ్ల రామకృష్ణ, ఎమ్మెల్యే, వెంకటగిరి నియోజకవర్గం వారు తెలియజేశారు. ప్రతి నియోజకవర్గంలోని యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని , అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, కోరుగండ్ల రామకృష్ణ, శాసనసభ్యులు, వెంకటగిరి నియోజకవర్గం వారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని తెలిపారు.

మంగళవారం వెంకటగిరి నియెజకవర్గం లోని విశ్వదయ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నందు ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కోరుగండ్ల రామకృష్ణ, శాసనసభ్యులు, వెంకటగిరి నియోజకవర్గం వారు జాబ్ మేళా ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈ జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కోరుగండ్ల రామకృష్ణ, శాసనసభ్యులు, వెంకటగిరి నియోజకవర్గం, వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సదుద్దేశంతో వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించ బడుతుందని తెలియజేశారు.అలాగే జాబ్ మేళాను ఉద్దేశించి మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీస్ వారితో మాట్లాడి అలాగే స్కిల్ డెవలప్మెంట్ వారితో కలిసి పెద్ద ఎత్తున జాబ్ మేళాలు నిర్వహించి ఎక్కువమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని దృఢ నిశ్చయంతో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా శుభ సంతోషమని అలాగే వెంకటగిరి నియోజకవర్గం లో ఉన్న యువతకు ఉపాధి అవకాశాలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించి అవకాశాలు కల్పించడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే చిన్న ఉద్యోగం, పెద్ద ఉద్యోగం అని చూడకుండా ప్రతి ఒక్కరు అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఈ మల్టీ నేషనల్ కంపెనీస్లో ఏదైతే అర్హతకు తగ్గ ఉద్యోగం వచ్చిందో దాని ద్వారా కంపెనీలో జాయిన్ అయి క్రమశిక్షణతో ఆత్మవిశ్వాసంతో రాణించి కుటుంబానికి ఆసరాగా ఉంటూ, కుటుంబంతో పాటు తిరుపతి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అదేవిధంగా జాబ్ మేళాలో సెలెక్ట్ అయిన వారికి ఆఫర్ లెటర్స్, గౌరవ శాసనసభ్యులు వెంకటగిరి నియోజకవర్గం చేతులు మీద ఇప్పించడం జరిగింది.

డా ఎం.విజయ శేఖరం ప్రిన్సిపాల్, విశ్వోదయ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల వెంకటగిరి,మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ జాబ్ మేళా ముఖ్య ఉద్దేశమని తెలిపారు. వెంకటగిరి నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు వారి సహకారంతో స్కిల్ డెవలప్ మెంట్ వారి ఆద్వర్యంలో వివిధ కంపెనీల వారితో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతోందని అన్నారు.

ఆర్. లోకనాథం, డిఎస్డివో, Apssdc, మాట్లాడుతూ.. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగం కల్పించే దిశగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ జాబ్ మేళాకి మంది 236 హాజరవుగా, 108 మంది వివిధ కంపెనీలకు సెలెక్ట్ అయ్యి, అలాగే 34 మంది షార్ట్ లిస్ట్ అవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆర్. లోకనాథం,జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి, డా ఎం.విజయ శేఖరం ప్రిన్సిపాల్, విశ్వోదయ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల , డా వై మాల్యాద్రి గారు, టిపిఓ , విశ్వదయ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల , మరియు లక్ష్మీ నరసింహ, ఎంపీడీవో, వెంకటగిరి మండలం, ఏపీ ఎస్ ఎస్ డి సి, సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు,నాయకులు మరియు మొదలగువారు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *