Breaking News

వైభవంగా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాజన్మాష్టమి ఉత్సవాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా శనివారం స్థానిక రామవరప్పాడు లో వేమినేని రామస్వామి వీధిలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యాదవ సంఘం అధ్యక్షులు కొంగన రవికుమార్ మాట్లాడుతూ ఈ ఉత్సవాలు 23 సంవత్సరాలుగా రామవరప్పాడు, యామనేని రామస్వామి వీధిలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి స్థానిక పెద్దలు, సంఘ నాయకులు ఎంతో కృషి చేశారని వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నారని ఆయన అన్నారు. కార్యక్రమములో ముఖ్య అతిథులను, నాయకులను మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు తదితర నాయకులు విచ్చేసి స్వామిని, దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్లారని ఆయన చెప్పారు. సాయంత్రం ఉట్టి కొట్టే ఉత్సవ కార్యక్రమం భక్తుల ఆనందడోలికల నడుమ కనుల పండుగుగా జరిగిందని అని తెలిపారు. తదనంతరం వక్తలు, యాదవ సంఘం నాయకులు మాట్లాడుతూ కృష్ణ జన్మాష్టమి వేడుకలు 23వ వార్షికోత్సవం ఇంత ఘనంగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీకృష్ణ భగవానుడు ప్రజలకు భోగభాగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని, మనస్ఫూర్తిగా కోరుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మెండే వెంకటేష్, తుపాకుల స్వామి, సుంకర కోటేశ్వరరావు, కృష్ణం వెంకట సుబ్బారావు, యాదవ సంఘం నాయకులు, నగర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానికులు, స్థానిక పెద్దలు, అభిమానులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *