విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత ఆరేళ్లుగా ప్రభుత్వ అనుమతి కోసం వేచి ఉన్న ఏపిపిటిడి (ఆర్టీసి)ఉద్యోగుల పదోన్నతలు పైలుకు మొక్షం లభించక పదోన్నతలకు అర్హతలు ఉండి కూడా ఈ ఆరేళ్లలో సుమారు 2000 మంది రిటైర్ అయ్యారని,ప్రస్తుతం ఇంకా పెండింగు ఉన్న పదోన్నతలకు ప్రభుత్వ అనుమతులు ఇస్తే ఆర్టీసిలో ఉన్న అధికార్లు నుండి క్లాష్ 4 ఉద్యోగివరకు సుమారు 3000 మందికి పదోన్నతలు వస్తాయని,ఇవి కాకుండా మరో 12 పైల్సుకూడా ప్రభుత్వ అనుమతి కోసం ఏపిపిటిడి కమీషనర్ శ్రీ.సి.హెచ్.ద్వారకాతిరుమలరావు ప్రభుత్వం అనుమతి కోసం పంపించిన పైల్సుకు వెంటనే అనుమతులు ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తూ బుదవారం సచివాలయంలో జరిగిన ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జాయింటు స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శ్రీ.కె.విజయానంధ్ ఐఏయస్ గారికి ఏపిపిటిడి (ఆర్టీసి) ఎంప్లాయీస్ యూనియన్ (ఇ.యు) రాష్ట్ర కమిటీ తరఫున లేఖ ఇచ్చామని ఇ.యు రాష్ట్రఅధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు,రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.వీ.నరసయ్య బుదవారం ఒక ప్రకటనద్వారా తెలియజేసారు.
ప్రధాన డిమాండ్లు:
1) ప్రభుత్వ అనుమతీ కోసం ఎదురు చూస్తున్న ఆర్టీసి ఉద్యోగుల పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి.
2) అన్ని కేటగిరీలలో ఖాళీలు భర్తీ కండక్టర్లు, డ్రైవర్లు, మెకానికల్ సిబ్బంది మరియు ఇతర విభాగాలలో ఉన్న 10,000 ఖాళీలను వెంటనే భర్తీ చేయడానికి అనుమతి ఇవ్వాలి.
3) పిటిడి(ఆర్టీసి)ఉద్యోగులకు 11వ పిఆర్శీకి సంబంధించిన పెండింగ్ 24 నెలల అరియర్స్, డిఏ బకాయిలు, కొత్త డిఏలు చెల్లించాలని విజ్ఞప్తి చేసారు.
4) ఆర్టిసీ ఉద్యోగులకు విలీనం కాకముందున్న పాత విధానంలో వైద్య సౌకర్యాలు పునరుద్ధరించాలని,ఇ.హెచ్.యస్ ద్వారా క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ సదుపాయం అందించాలని విజ్ఞప్తి చేసారు.
5) ఆర్టిసిలో ప్రభుత్వ గుర్తింపుసంఘాలలో ఏపి పిటిడి కమిషనర్ ప్రభుత్వానికి సిఫార్సుచేసిన ఏపిపిపిటిడి ఎంప్లాయీస్ యూనియన్ & ఏపిపిటిడి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోషియేన్ కు పర్మినెంటు జాయీంటు స్టాఫ్ కౌన్సిల్ లోను,ఇ.హెచ్.యస్ మేనేజింగు కమిటిలో సబ్యులుగా అవకాశం కల్పించాలని లేఖ ఇచ్చామని తెలిపారు.
ఇవే కాకుండా ప్రభుత్వ అనుమతి కోసం పిటిడి కమీషనర్ గారు చేసిన సిఫార్సులన్నిటికీ అనుమతులు ఇవ్వాలని ఎంప్లాయీస్ యూనియన్ గా సి.యస్ గారికి ఇచ్చిన లేఖ ద్వారా విజ్ఞప్తి చేసామని ఆర్టీసి ఇ.యు రాష్ట్రఅధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు తెలిపారు.
Prajavartha Online Telugu News