Breaking News

మునిసిపల్ హోల్ సేల్ కూరగాయల మార్కెట్ తరలింపుపై వస్తున్న పుకార్లను నమ్మవద్దు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని కొల్లి శారదా మునిసిపల్ హోల్ సేల్ కూరగాయల మార్కెట్ తరలింపుపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని, నగరంలో కొన్ని వ్యాపార సంఘాల వారు వ్యాపారస్తులకు అసత్య వదంతులు సృష్టిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అవి పూర్తి అవాస్తవమని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొల్లి శారదా మునిసిపల్ హోల్ సేల్ కూరగాయల మార్కెట్ లోని 81 షాపులకు 25 సంవత్సరాలు లీజు గడువు ముగిసినందున నిబంధనల ప్రకారం ఈ నెల 18 నుండి 20వ తేదీ వరకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించడం జరిగిందని, దీని వలన నగర పాలక సంస్థ చరిత్రలో రికార్డ్ స్తాయిలో జిఎంసికి ఆదాయం పెంచేలా వ్యాపారస్తులు భారీ సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమన్నారు. నగర పాలక సంస్థ అభివృద్దికి దోహదపడే ఆదాయ వనరుల పెంపుదలకు ఇదొక గొప్ప ఉదాహరణన్నారు. నగర పాలక సంస్థ ఆదాయానికి భంగం కలిగించేలా వ్యవహరించే ఎవరిపైనైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. కొంతమంది వ్యాపార సంఘాల పేరుతో కొల్లి శారదా హోల్ సేల్ మార్కెట్ తరలిస్తున్నారనే వదంతులు, నగరంలోని వేరే ప్రాంతంలో నూతన హోల్ సెల్ కూరగాయల మార్కెట్ కు అనుమతులు వచ్చినట్లు తప్పుడు ప్రచారాలు చేస్తూ, వ్యాపారస్తులను గందరగోళానికి గురిచేస్తున్నారని, ఇటువంటి వదంతులను వ్యాపారస్తులు నమ్మవద్దన్నారు. నగర పాలక సంస్థ బస్టాండ్ వద్ద గల కొల్లి శారదా హోల్ సెల్ కూరగాయల మార్కెట్ తప్ప, నగరంలో ఏ ఇతర హోల్ సెల్ మార్కెట్ కు అనుమతులు ఇవ్వలేదన్నారు. వదంతులు వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *