విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో గల కమిషనర్ చాంబర్ నందు PMAY URBAN 2.0 లో భాగంగా అంగీకార్–2025 బ్రోచర్ మరియు పోస్టర్స్ VMC కమిషనర్ ధ్యానచంద్ర H M చేతుల మీదుగా శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – అర్బన్ 2.0 (PMAY-U 2.0) – అంగీకార్ -2025 ప్రచార అవగాహనా కార్యక్రమంలో భాగంగా హౌసింగ్ లబ్ధిదారులకు మరియు ప్రజలకు ఈ పథకం యొక్క ప్రయోజనాలు తెలియజేయడం, PM సూర్య ఘర్ ముఫ్తీ బిజిలి యోజన ప్రయోజనాలను లబ్ధిదారులకు చేరవేయడం, కొత్తగా నిర్మించబడిన ఇళ్ల గృహప్రవేశాలు నిర్వహించడం తదితర విషయాల పై అవగాహన కల్పించే ఉద్దేశంతో అంగీకార్ -2025 ప్రచారకార్యక్రమాన్ని రెండు నెలల పాటు చెప్పట్టే విధంగా (సెప్టెంబరు మరియు అక్టోబర్ ) కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేశారని అన్నారు. ఈ కార్యక్రమానికి వి.యం.సి. యూ.సి.డి ప్రాజెక్ట్ ఆఫీసర్ పి. వెంకట నారాయణ , CLTC సమత మరియు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ సుజాత ,శేఖర్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News