-బొండా ఉమామహేశ్వరరావు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఎల్లప్పుడూ స్వచ్ఛ సర్వేక్షన్ లో ముందంజలో ఉంచాలని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం ఉదయం అజిత్ సింగ్ నగర్ ఎంకే బేగ్ స్కూల్ వద్ద విజయవాడ నగరపాలక సంస్థ నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం లొ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ ఆఫీసర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు సిసిఎల్ఏ జి. జయలక్ష్మి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మరియు సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులైన నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సర్ సురేక్షన్ 2024లో విజయవాడకు గార్బేజ్ ఫ్రీ సిటీ గా విజయవాడకు సెవెన్ స్టార్ రేటింగ్ వచ్చినందున మనం దానిని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలని విజయవాడ ను ఎల్లప్పుడూ స్వచ్ఛ విజయవాడ గా స్వచ్ఛ సర్వేక్షన్ లో ముందంజలో ఉంచాలని అన్నారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ ఆఫీసర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు సిసిఎల్ఏ జి. జయలక్ష్మి మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జయప్రదం చేయటంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనదని, వారి సహకారం ఎల్లప్పుడూ ఉంటే విజయవాడ కచ్చితంగా అత్యుత్తమ పురస్కారాలను సాధిస్తుందని జయలక్ష్మి అన్నారు
ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు జనవరి నుండి ప్రతి మూడో శనివారం స్వచ్ఛందర స్వర్ణాంధ్ర నిర్విరామంగా ఘనంగా నిర్వహిస్తున్నామని. గత నెల వర్షాకాలం అయినందున మాన్సూన్ హైజిన్ అని అంశంపై ప్రజలకు అవగాహన కల్పించారని, ఈనెల హరితాంధ్ర ప్రదేశం అయినందున ఇంటి పైనే కూరగాయలను పండించుకోవడం, ఇంటి వద్దనే వ్యర్థాలతో ఎరువును తయారు చేసుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన మరియు జోనల్ కార్యాలయంలో కూడా టెర్రస్ గార్డెన్ మొదలుపెట్టాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా 52వ డివిజన్ కార్పొరేటర్ షాహినా సుల్తానా మాట్లాడుతూ ఆడవాళ్లు తలుచుకుంటే ఏమైనా చేయగలరని టెర్రస్ గార్డెనింగ్ చేయడం వల్ల సేంద్రియ కూరగాయలు ని తింటూ ఆరోగ్యంగా ఉంటూ అందరినీ ఆరోగ్యంగా ఉంచొచ్చని, ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని విజయవాడ నగరపాలక సంస్థ చేస్తూ ప్రజలని ప్రోత్సహించాలని అన్నారు.
వన్ ఎర్త్ వన్ లైఫ్ ఎన్జీవో ఫౌండర్ ఏలూరి లీలా కుమారి మాట్లాడుతూ రకరకాల కూరగాయలను, ఆకుకూరలను, పళ్ళను, పూల మొక్కలను, టెర్రస్ గార్డెన్ ద్వారా పండించడమే కాకుండా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కలిపేస్తున్నారని, ప్రతి ఒక్కరికి ఉచితంగా కూరగాయల గింజలు పంపిణీ చేసి వారిని టెర్రస్ గార్డెన్ కొరకు ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా హరితాంధ్రప్రదేశ్ ను నిర్మించేందుకు ఎంకే అజిత్ సింగ్ నగర్ ఎంకే బేక్ స్కూల్ మరియు మాకినేని బసవ పున్నయ్య ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో విద్యార్థులతో 300 మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్ డా. డి చంద్రశేఖర్, జోనల్ కమిషనర్ కే ప్రభుదాస్, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే అర్జునరావు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, ఎంకే బేగ్ స్కూల్ హెడ్మాస్టర్ ఎం హుస్సేన్, సిటీ టెర్రస్ గార్డెన్ సభ్యులు సురేష్, ఎంకే బేగ్ విద్యార్థినీ విద్యార్థులు, విఎంసి సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News