-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా సరన్నవరాత్రుల వేడుకల ఏర్పాట్లలో ఎటువంటి లోపం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం అన్నారు. శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణవేణి ఘాట్, భవాని ఘాట్, పున్నమి ఘాట్, కెనాల్ రోడ్, వినాయకుని గుడి, వన్ టౌన్ ప్రాంతాలు పర్యటించి దసరా శరన్నవరాత్రుల వేడుకల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రపంచ వ్యాప్తంగా వచ్చే అమ్మవారి భక్తులకు ఎటువంటి లోపం ఉండరాదని, విజయవాడ నగర పాలక సంస్థ వారు ఏర్పాటు చేసే వసతులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తులకు త్రాగునీటి సౌకర్యం ఏ పాయింట్ల వద్ద కల్పిస్తున్నారు క్యూలైన్ల వద్ద సౌకర్యాలు, పారిశుధ్య నిర్వహణ, ఉచిత చెప్పుల స్టాండ్, మరుగుదొడ్ల పాయింట్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కన్వేయర్ బెల్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News