Breaking News

ఉత్సాహంగా జిల్లా యువజనోత్సవాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అద్భుత ప్రదర్శనలు, ఆకట్టుకునే నృత్యాలు, యువత కేరింతల మధ్య ఎన్టీఆర్ జిల్లా యువజనోత్సవాలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. యువజన సర్వీసుల శాఖ, స్టెప్, క్రిషి ఆధ్వర్యంలో విజయవాడ కేబీఎన్ కళాశాలలో గురువారం జరిగిన ఎన్టీఆర్ జిల్లా యువజనోత్సవాలకు విజయవాడ ఆర్డిఓ కె. చైతన్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డిఓ మాట్లాడుతూ… యువత తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి యువజనోత్సవాలు మంచి వేదికన్నారు. జిల్లా యువత.. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలలో బహుమతులు సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా యువజన సంక్షేమాధికారి & ముఖ్య కార్యనిర్వహణాధికారి యు. శ్రీనివాసరావు మాట్లాడుతూ… జిల్లా స్థాయి విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని చెప్పారు. రాష్ట్రస్థాయిలో విజయం సాధించిన వారికి, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రతి ఏటా జనవరి నెలలో న్యూఢిల్లీలో నిర్వహించే జాతీయస్థాయి యువజనోత్సవాలలో పాల్గొనే అవకాశం ఉంటుందని చెప్పారు. జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన వివిధ కళాశాలల విద్యార్థులు బృందగానం, నృత్యం, చిత్రలేఖనం వంటి అంశాలలో పోటీపడ్డారు. అద్భుత ప్రదర్శనలు చేసి ఆకట్టుకున్నారు. అబ్బురపరిచే ప్రదర్శనలను చూసి యువత కేరింతలు కొట్టారు. జానపద గీతాల విభాగంలో ఎం. సింధు రాజేశ్వరి బృందం మొదటి స్థానంలో నిలవగా, టి.కిరణ్ బృందం ద్వితీయ స్థానంలో నిలిచింది. జానపద నృత్యం విభాగంలో విఘ్నేష్ కార్తికేయ బృందం మొదటి బహుమతిని, కౌశిక్ బృందం రెండో బహుమతిని దక్కించుకున్నాయి. సైన్స్ మేళలో కే అఖిల బృందం తొలి స్థానంలో, సిహెచ్. హాసిని బృందం ద్వితీయ స్థానంలో నిలిచాయి. స్టోరీ రైటింగ్ లో కే. బాల మణి ప్రసాద్ ప్రథమ బహుమతిని, కె.ప్రదీప్ కుమార్ ద్వితీయ బహుమతిని పొందారు. పోయెట్రీలో ఎం. శ్రీలేఖ, వి. వర్షిణి మొదటి,రెండు స్థానాలు పొందగా, చిత్రలేఖనంలో డి. సుధీక్ష, ఎం. శ్రీ వైష్ణవి, డిక్లమేషన్లో కే.శ్రావణి, ఎస్కే. నదియా ప్రథమ ద్వితీయ బహుమతులు పొందారు. విజేతలకు విజయవాడ ఆర్డిఓ కే.చైతన్య, మై భారత్, యూత్ ఆఫీసర్ సుంకర రాము మెమెంటోలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేబీఎన్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి.నారాయణరావు, ప్రిన్సిపల్ జి.కృష్ణవేణి, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ టి. శ్రీనివాస్, స్టెప్ క్రిషి మేనేజర్ డి.సుబ్బారావు, యువజన సర్వీసుల శాఖ ఫీల్డ్ ఆఫీసర్ అభిజ్ఞాన్, సిబ్బంది, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *