ప్రతి పౌరుడును సొంత వ్యక్తిలా భావించి మెరుగైన సేవలందించాలి…   

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ/వార్డు సచివాలయాలకు వివిధ సేవల నిమిత్తం వచ్చే ప్రతి పౌరుడును సొంత వ్యక్తిలా భావించి మెరుగైన సేవలందించాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ సచివాలయ సిబ్బందికి సూచించారు. విజయవాడ కృష్ణలంక లోని 102, 99 వార్డు సచివాలయాలను బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను వారి సంతృప్తి మేరకు పరిష్కరించే దిశగా అంకితభావంతో పనిచేయాలన్నారు. వారి సమస్యకు పరిష్కారం చూపి న్యాయం చేయాలన్నారు. నిర్దేశించిన కాల పరిమితిలో సచివాలయ సేవలు అందించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాలపరిమితి ముగిసే వరకూ వేచి ఉండరాదన్నారు. ప్లానింగ్ సెక్రటరీ తమ పరిధిలో ఆక్రమణలు లేకుండా చూసి పబ్లిక్ ప్రాంతాలను కాపాడాలన్నారు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల సమాచారంతో కూడిన బోర్డులతో పాటు లబ్దిదారుల జాబితాలను ప్రదర్శించాలన్నారు. ఫీవర్ సర్వే. గర్బిణీలకు సంబంధించిన వివరాలను పొందుపరిచే రిజిష్టర్ లో కచ్చితంగా వివరాలను నమోదు చేయాలన్నారు.

యూపీఎస్ సి పరీక్షల మెటీరియల్ తనిఖీ…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 10న నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించిన మెటీరియలను పరిశీలించి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచే ఏర్పాట్లను సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ పర్యవేక్షించారు. ఈ పరీక్షల నిర్వహణకు 29 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13,674 మంది పరీక్షలు వ్రాయనున్నట్లు ఆయన వివరించారు. వీరి వెంట కలెక్టరేట్ పరిపాలనాధికారి వి.శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *