Breaking News

అమరావతిలో WB& ADB బృందం 2వ రోజు పర్యటన..GBV/SEA/SH అంశాలపై సెషన్ల నిర్వహణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(APCRDA) ప్రధాన కార్యాలయంలో ప్రపంచ బ్యాంక్ (World Bank), ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) జాయింట్ టెక్నికల్ మిషన్‌లో భాగంగా 2వ రోజు GBV/SEA/SH(GBV – Gender-Based Violence, SEA – Sexual Exploitation and Abuse, SH – Sexual Harassment) అంశాలపై సెషన్లు జరిగాయి. ఇందులో అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(AIUDP) అమలులో భాగంగా GBV/SEA/SH అంశాలలో క్షేత్రస్థాయిలో అమలు కావాల్సిన కార్యకలాపాలపై పూర్తీ స్థాయిలో చర్చలు జరిగాయి.

శుక్రవారం ఉదయం CRDA ప్రధాన కార్యాలయంలోని ఒకటవ ఫ్లోర్‌లోని సమావేశ మందిరంలో AIUDP ప్రాజెక్టు అమలులో భాగంగా GBV/SEA/SH(GBV – Gender-Based Violence, SEA – Sexual Exploitation and Abuse, SH – Sexual Harassment) అంశాలపై నిర్వహించిన ప్రారంభ సదస్సుతో సమావేశం ప్రారంభమైంది. ఈ అంశాలపై WB& ADB బృందంతో APCRDA, ADCL అధికారులు పలు సెషన్లు నిర్వహించారు. WB& ADB బృందంలో జయా శర్మ(సీనియర్ జెండర్ & సోషల్ డెవలప్‌మెంట్ స్పెషలిస్ట్, వరల్డ్ బ్యాంక్), శ్రితి మున్షి(GBV కన్సల్టెంట్, వరల్డ్ బ్యాంక్), APCRDA, ADCL అధికారులు, PgMC(ప్రోగ్రాం మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ), PMC(ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ), కాంట్రాక్టర్ ప్రతినిధులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఈ రోజు జరిగిన సెషన్లలో GBV సంబంధిత ముఖ్యాంశాలు, లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు అందుబాటులో ఉన్న విధానాలు & మార్గాలు, ఫిర్యాదు పరిష్కారం, బాధితుల గోప్యతలో స్థానికంగా ఉండే జెండర్ కమిటీల, మహిళల బృందాల ప్రాధాన్యత గురించి WB& ADB బృందంలోని సభ్యులు చర్చించారు. అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఉన్న పలు పని ప్రదేశాలలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురైతే బాధితులు ఫిర్యాదు చేసేందుకు అందుబాటులో ఉన్న గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మెకానిజం(GRM), ఆ మెకానిజం పనిచేయాల్సిన విధానం, SEA/SH GRM కమిటీ అంశాలపై చర్చలు జరిగాయి. పోష్& నాన్ పోష్(POSH and non-POSH) కేసుల నిర్వచనం, వీటి మధ్య ఉన్న తారతమ్యం, SEA/SH ఘటనలు జరిగినప్పుడు స్పందించి బాధితులకు అందించాల్సిన సత్వర సహాయం తదితర అంశాలపై WB& ADB బృందంలోని సభ్యులు విపులంగా చర్చించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *