విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ప్రజలకు అందుబాటులోకి వేద సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ప్రారంభించబడింది. గురువారం గురువారం 58వ డివిజన్ (నందమూరి నగర్) ఆర్ Ê బి కాలనీ, 1వరోడ్డునందు గల వేద డెంటల్ క్లినిక్‌ను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన డెంటల్ క్లినిక్ ప్రారంభం కావడం ఎంతో సంతోషకరమైన విషయం అని అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్నిరకాల దంత చికిత్సలు ఒకేచోట అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ క్లినిక్‌ను ఏర్పాటు చేశారని, వేద డెంటల్ క్లినిక్‌లో లేటెస్ట్ ఎక్విప్‌మెంట్, ఆధునిక యంత్రాలు, డిజిటల్ టెక్నాలజీతో కూడిన కంప్యూటర్ ఆధారిత చికిత్సలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. స్పాట్‌లోనే ఖచ్చితమైన నిర్ధారణ చేయడంతో పాటు, అనవసరమైన ఎక్స్-రేలు లేకుండా ఆధునిక విధానాలతో చికిత్స అందించటం ఈ క్లినిక్ ప్రత్యేకత అని తెలియజేశారు.
అనంతరం వేద డెంటల్ క్లినిక్ డైరెక్టర్ అయిన బొప్పన ఉషారాణి మాట్లాడుతూ ఇక్కడ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఫిల్లింగ్స్, క్యాప్స్, డెంటల్ చెకప్, టూత్ ఎక్స్ట్రాక్షన్, క్లీనింగ్, కన్సల్టేషన్, టీ-3 ప్లేస్‌మెంట్ వరకు అన్నిరకాల దంత చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన మరియు అందుబాటు ధరలలో చికిత్స అందించడమే ఈ క్లినిక్ ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. అదేవిధంగా తమ క్లినిక్‌లో గోల్డెన్ కార్డు అనే స్కీమ్‌ని పరిచయం చేస్తున్నట్లు ఈ స్కీం ద్వారా అతి తక్కువ ధరలకే ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశం కలుగుతుందని తెలియజేశారు. త్వరలోనే ఆరోగ్యశ్రీ, ఈహెచఎస్ సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలియజేశారు. 25 సంవత్సరాల పైన అనుభవం గల జె.శ్రీకాంత్‌రెడ్డి లాంటివారు తమ క్లినిక్‌లో వైద్యం అందిస్తున్నారని తెలియజేశారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఆధునిక డెంటల్ సేవలను పొందాలని కోరారు. క్లినిక్ నిర్వాహకులు కూడా ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ అయిన బొప్పన శ్యామ్సన్, ఐసిహెచ్ ఏపీపీఎస్ ఫౌండేషన్ చైర్మన్ ఎస్.దేవికుమారి, ఎస్.రమేష్ రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News