Breaking News

విజయవాడ నగరంలో బర్మా ఫుడ్ జంక్షన్ గొప్ప ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో భోజన ప్రియుల కోసం బర్మా ఫుడ్ జంక్షన్ గొప్ప ప్రారంభమైంది. గురువారం పండిట్ నెహ్రూ బస్టాండ్ ఎదురుగా గల ఈ3 కాంప్లెక్స్‌లో బర్మా ఫుడ్ జంక్షన్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ3 ఎం.డి. అయిన జే. నారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బర్మా ఫుడ్ జంక్షన్ నిర్వహకులు అయిన అమ్మజాల జగదీష్, నాగ శివ నవ్య మాట్లాడుతూ బర్మా రామిన్ అనే కొత్త రకం వంటకం విజయవాడకు తమ ద్వారా పరిచయం చేయడం చాలా ఆనందకరంగా ఉంది అని తెలియజేశారు. అదేవిధంగా తమ యొక్క ఫుడ్ జంక్షన్‌లో నాన్వెజ్ స్టార్టర్స్, వెజ్ స్టాటర్స్, నాన్వెజ్ రామిన్, వెజ్ రామిన్, కొబ్బరి పులావ్, చికెన్ స్టార్టర్స్ లభిస్తాయని తెలియజేశారు. అతి తక్కువ ధరలలో రుచికరమైన, సుచికరమైన ఆహారాన్ని ప్రజలకు అందించడమే తమ యొక్క ధ్యేయమని అందులో భాగంగా మరియు ప్రారంభోత్సవ సందర్భంగా వారం రోజులపాటు 30% డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలియజేశారు. అదే విధంగా కాంబో ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయని, భవిష్యత్తులో కాలేజీ స్టూడెంట్స్‌కి ప్రత్యేకమైన డిస్కౌంట్‌లో అందుబాటులో ఉంచుతామని, ఈ సౌకర్యాన్ని నగర ప్రజలు వినియోగించుకోవాలని తెలియజేశారు. అనంతరం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మరియు బర్మా రామిన్ సంస్థ అధినేత అయిన దులాయ్ ఉజ్వల్ తేజ్‌కిరణ్ మాట్లాడుతూ ఇది తమ మొదటి ఫ్రాంచెజ్ అవుట్లైట్ అని తెలియజేశారు. విజయవాడలో తమ మొదటి ఫ్రాంచైజ్ రావడం ఆనందకరంగా ఉందని వైజాగ్‌లో తన బర్మా రామిన్ షాపును ఆదరించినట్లు విజయవాడలో కూడా ఆదరిస్తారని కోరారు. ఈ కార్యక్రమంలో దర్శి శ్రీనివాస్, దర్శి పుష్పలత స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వల్ప వర్షానికే జలమయం.. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలం

-​రాజారాజేశ్వరి పేట నుంచి బుడుమేరు వరకు నీట మునిగిన రోడ్ల పరిశీలన -​గత రెండేళ్లుగా నగరానికి ఒక్క రూపాయి నిధులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *