విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్య సమస్యలు సృష్టిస్తున్న వారిని కార్పొరేషన్ ప్రజారోగ్య విభాగం అధికారులు గుర్తించి మొబైల్ కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి జి. లెనిన్ బాబు విచారించి సమస్యలకు కారణ మైన వారికి జరిమానా విధించారు. సర్కిల్- 1 కార్యాలయంలో శుక్రవారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సంచార న్యాయస్థానం నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారులపై చెత్త, చెదారం వేసిన వారితో పాటు, రహదారుల పై జంతువులు, పెంపుడు కుక్కలను వదలినవారు, కాలువల్లో వ్యర్ధాలు వేసి మురుగుపారుదలకు ఆటంకం కలిగించివారు, డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసే వారిని గుర్తించి 17 కేసులు నమోదు చేసి వారిని జడ్జ్ ముందు హాజరుపరిచారు. విచారించిన జడ్జి వారికి అపరాధ రుసుం విధించగా అధికారులు రూ. 3,150/-వసూలు చేశారు. అధికారులు ఏఎంహెచ్1 అన్నపూర్ణ, D. సోమరాజు, SVS శ్రీధర్, శానిటరీ సూపర్వైజర్సలు , శానిటరీ ఇన్స్పెక్టర్లు జి. రంగారావు,గుడ్. శ్రీనివాస్ రావు , శామ్యూల్ దుర్గా రావు, వి. శ్రీనివాస్ రావు, డి. రాజు.
Prajavartha Online Telugu News