Breaking News

“సైన్స్ సమగ్ర మహోత్సవ్ – 2K26” ముగింపు కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
“సైన్స్ సమగ్ర మహోత్సవ్ – 2K26” ముగింపు కార్యక్రమం విజయవంతం నేడు విజయవాడలోని చిట్టూరి పబ్లిక్ స్కూల్ లో ఏపీ సైన్స్ సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ సమగ్ర మహోత్సవ్ – 2K26” ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి ప్రవీణ్ ఆదిత్య, ఏపీ సైన్స్ సిటీ సీఈవో కేశినేని వెంకటేశ్వర్లు ఫిబ్రవరి 23 న 2 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో నిర్వహించిన “ సైన్స్ సమగ్ర మహోత్సవ్ – 2K26” కార్యక్రమంకు విశేష స్పందన రాష్ట్ర వ్యాప్తంగా 4118 పాఠశాలల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న 30 వేల మంది విద్యార్ధులు విద్యార్థుల రూపొందించిన ప్రాజెక్టులను గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో.. మొత్తంగా 4 దశల్లో నిపుణుల జ్యూరీ కమిటీ ఆధ్వర్యంలో స్క్రూట్నీ కార్యక్రమం ప్రాజెక్టులు ఆవిష్కరణ, శాస్త్రీయ స్పష్టత, ఆచరణ, సమష్టి కృషి & పర్యావరణహిత దృక్పథం వంటి ప్రమాణాల ఆధారంగా ప్రాజెక్టులు ఎంపిక ఆయా ప్రాజెక్టుల్లో 26 జిల్లాల నుంచి జిల్లాకు ఒకటి చొప్పున 4 దశల్లో నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా ఎంపిక 6 నుండి 9 వ తరగతుల ప్రభుత్వ & ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల్లో ఆవిష్కరణ శక్తిని, శాస్త్రీయ ఆలోచనలను వెలికితీసే వేదికగా నిలిచిన కార్యక్రమం జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి విజేతలకు ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి ప్రవీణ్ ఆదిత్య, ఏపీ సైన్స్ సిటీ సీఈవో కేశినేని వెంకటేశ్వర్లు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం విజేతలకు ప్రతిభా పురస్కారాలు, సర్టిఫికెట్లు, ప్రత్యేక మెంటార్షిప్ అవకాశాలు & సమ్మర్ ఇన్నోవేషన్ క్యాంప్ లో ప్రవేశం, కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు డిజిటల్ సర్టిఫికెట్ లు ప్రదానం రాష్ట్రంలో ప్రతి విద్యార్థి గ్లోబల్ స్టూడెంట్ గా ఎదగాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం మేరకు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఏపీ సైన్స్ సిటీ ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో సైన్స్, టెక్నాలజీ & నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ, ప్రపంచ స్థాయి ఎకో సిస్టమ్‌ను నిర్మించడంలో భాగంగా విద్యార్ధులతో భాగస్వామ్యంతో వినూత్న కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్న ఏపీ సైన్స్ సిటీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించడం.. ఈ సైన్స్ ఇన్నోవేషన్ పోటీ యొక్క ప్రత్యేకత.. సైన్స్ సమగ్ర మహోత్సవ్ 2K26, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సాధించడం ఏపీ సైన్స్ సిటీకి గర్వకారణం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి ప్రవీణ్ ఆదిత్య, ఏపీ సైన్స్ సిటీ సీఈవో కేశినేని వెంకటేశ్వర్లు, ఇతర ఉన్నతాధికారులు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *