– 91549 70454తో కలెక్టరేట్‌లో ఏర్పాటు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రబీ ధాన్యం సేకరణకు సంబంధించి జిల్లా కలెక్టరేట్‌లో 91549 70454తో కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ కేంద్రం అందుబాటులో ఉంటుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రైతులు ధాన్యం సేకరణకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఈ నంబరుకు ఫోన్ చేసి తెలియజేయవచ్చని సూచించారు. ఈ కేంద్రం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కార్యాలయంలోనూ అదనంగా 77020 03571 నంబరుతో కంట్రోల్ రూమ్ కూడా అందుబాటులో ఉంటుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
Prajavartha Online Telugu News