కోవిడ్ ధర్డ్ వేవ్ రాకుండా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి…

-కోవిడ్ పోయిందిలే అని ఏవరూ భ్రమించ వద్దు..
-మాస్కుధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్స్ వినియోగం తప్పనిసరి
-ప్రజలు మాల్సులో గుంపులు,గుంపులుగా తిరగవద్దు, కోవిడ్ కట్టడిపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి..
-జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. సుహాషిని

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఒక్కరు కోవిడ్ నియంత్రణ పట్ల అవగాహన కలిగి వ్యాక్సినేష్ వేయించుకోవడం ద్వారా థర్డ్ వేవ్ రాకుండా నియంత్రించగలమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. సుహాషిని అన్నారు. స్థానిక కైకాల సత్యనారాయణ మున్సిపల్ ఆడిటోరియంలో సోమవారం డీఎంఅండ్ హెచ్ ఓ సుహాషిని వ్యాక్సినేషన్ పంపిణీ, కోవిడ్ నియంత్రణ,ఇంటింటి సర్వే వంటి పలు అంశాలపై డివిజన్ పరిధిలో గల ఏఎన్ఎమ్,ఆశా వర్కలతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. కోవిడ్ పోయిందిలే అని ఎవరూ భ్రమించవద్దని, కోవిడ్ నియంత్రణకు వ్యాక్సినేషన్ ఒక్కటే ప్రధాన మార్గమని అన్నారు. వ్యాక్సినేషన్ వేయించుకోవడంలో చాలా మంది సందేహిస్తున్నారని, మీ వల్ల మీ ఇంటిలో ఉన్న పెద్దలు, గర్భణీ, బాలింతలకు, చిన్నారులకు కోవిడ్ వచ్చే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరు కోవిడ్ కట్టడికి సహకరించాలని కోరారు. ఇప్పటి వరకు మొదటి డోస్ తీసుకోని వారు తప్పనిసరిగా వేయించుకోవాలని, రెండో మోతాదు తీసుకోవలసిన వారు వైద్యులు సూచనల మేరకు నిర్ణీత సమయంలోనే తీసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రతి పీహెచ్ సీ, గ్రామ, వార్డు సచివాలయాల్లో వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంచామన్నారు. ముఖ్యంగా యువకులు మోటారు వాహనాలపై ఇద్దురు, ముగ్గురు కలసి మాస్కులు లేకుండా తిరుగుతున్నారని మీ వల్ల మీ ఇంటిలో వారికి కోవిడ్ వచ్చే అవకాం ఉందన్నారు. కోవిడ్ నియంత్రణకు మాస్కు ధరిస్తూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ, శానిటైజర్లు వినియోగించాలన్నారు. ప్రజలు షాపింగ్ మాల్సు, వాణిజ్య వ్యాపార సంస్థలకు వెళ్లేటప్పుడు గుంపులు గుంపులుగా ఉండవద్దని వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ఇచ్చే సలహాలను తప్పకుండా పాటిస్తూ మాస్కు ధరించాలన్నారు. సమావేశంలో పలువురు వైద్యాధికారులు, ఏఎన్ఎమ్,ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *