Breaking News

స్పందనలో వచ్చిన అర్జీలను సంబందిత శాఖాధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలి…

-గృహనిర్మాణసంస్థ ద్వారా రుణాలు పొంది తిరిగి చెల్లించని వారికి వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా వారి ఇంటిని రిజిస్ట్రేషన్ చేస్తుంది.
-18 నుంచి 45 ఏళ్ళ వయస్సుగల వాళ్లందరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలి..
-ఆర్డీవో శ్రీనుకుమార్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందనలో వచ్చిన అర్జీలను డివిజన్ లోని వివిధ శాఖల అధికారులు తమ పరిధిలోని అర్జీలను నిర్ణీత సమయంలోనే పరిష్కరించాలని ఆర్డీవో శ్రీనుకుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఆర్టీవో శ్రీనుకుమార్ డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు ఇచ్చిన అర్జీలు సంబందిత శాఖల అధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించి వారికి న్యాయం చెయ్యాలన్నారు. తమ పరిధిలోని కాని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందున్న డివిజన్ పరిధిలో గల మండల స్థాయి, గ్రామ స్థాయిలోని సచివాలయాల్లో ఏ ఒక్క అర్జీ పెండింగ్ లో లేకుండా పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ ద్వారా 1983 నుంచి ఇప్పటి వరకు అర్హులైన లబ్దిదారులకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేసిందన్నారు. ఇళ్లు నిర్మించుకొనే నిమిత్తం సంబందిత స్థల యజమానులు గృహనిర్మాణ సంస్థ లో వారికి అలాట్ చేసిన పట్టాను తాకట్టు పెట్టి అప్పుతీసుకొని తిరిగి చెల్లించని వారు గుడివాడ డివిజన్ పరిధిలో ఉన్న వారందరికీ ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా క్రమబద్దీకరించి రిజిస్ట్రేషన్ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో శ్రీనుకుమార్ కోరారు. సంబంతి సచివాలయ సిబ్బంది, గ్రామ పంచాయితీ కార్యదర్శలు, విఆర్వోలు అర్హులను గుర్తించి పెండింగ్ లేకుండా ఆన్ లైన్ లో అప్ లోడ్ చెయ్యాలన్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా డివిజన్ పరిధిలో 18 నుంచి 45 ఏళ్లు లోపు గల వారందరికీ పీహెచ్ సీలు, సచివాలయాలు ద్వారా వ్యాక్సినేషన్ వేసే ప్రక్రియ జరుతుందన్నారు. వ్యాక్సిన్ ఇప్పటి వరకు తీసుకోనివారు, రెండో మోతాదు తీసుకోవలసిన వారు వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. కోవిడ్ నియంత్రణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగిఉండాలని, మాస్కులు ధరించడం, శానిటేషన్ వినియోగం, బౌతిక దూరం పాటించడం తప్పని సరిగా పాటించాలన్నారు. స్పందన ద్వారా కార్యాలయానికి 5 అర్జీలు వచ్చాయని వాటిని పరిష్కారం నిమిత్తం సంబందిత శాఖాధికారులకు పంపించామని ఆర్డీవో శ్రీనుకుమార్ తెలిపారు. కార్యక్రమంలో కార్యాలపు ఏవో స్వామినాయుడు, , అసిస్టెంట్ బీసీ వెల్ఫేర అధికారిణి గురవమ్మ, పలువుర డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *