విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యలు పట్టని పాలకులకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని సిపిఐ నగర్ కార్యదర్శి జి.కోటేశ్వరరావు హెచ్చరించారు. స్థానిక 49వ డివిజన్ కమిటీ సమావేశం డివిజన్ నాయకులూ చేపూరి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సిపిఐ నగర్ కార్యదర్శి కోటేశ్వరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి నేతృత్వం లోని ఎన్డీయే ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో టిడిపి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గాని ప్రజా సమస్యల పట్ల అలసత్వం ప్రదర్శితుండటంతో అన్ని వర్గాల ప్రజలలో తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉందని అన్నారు. రోజురోజుకి పెరుగుతున్న నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజల జీవితం దుర్భరంగా మారిందని, ఇది ఏమి పట్టనట్టు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ధరల నియంత్రణకు ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహిస్తూ సామాన్యుడు జీవించే హక్కును సైతం కాలరాసున్నారు ఆగ్రహం వ్యకతం చేసారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడచినా తరువాత కూడా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని, అలాగే రాష్ట్రంలోని కూటమి నాయకులు ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తాము, లేదంటే ప్రతి నిరుద్యోగికి నెలకు 3 వేల నిరుద్యోగ భృతి కల్పిస్తామన్న హామీ ఏమైందని ప్రశించారు. రాష్ట్రంలో పేదవాడు అనారోగ్యం వస్తే జీవించే హక్కు లేదు అన్న చందంగా ఆరోగ్యశ్రీ ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ, ఆరోగ్యశ్రీ బిల్లులను సకాలంలో చెల్లించకుండా ప్రజలకు సరైన అందని ద్రాక్షగా మార్చారని అన్నారు. ఇదే సందర్భంలో ప్రభుత్వం ప్రభుత్వరంగ వైద్య వ్యవస్థని బలోపేతం చేయకూడని గత ప్రభుత్వం ప్రారంభించదలచిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను దానికి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను మేము నడపలేము అంటూ ప్రవేటువారికీ అప్పచెప్పడం వారి చేతకానితనానికి నిదర్శనంగా చెపొచ్చు అని ఎద్దేవా చేసారు. కేంద్ర ప్రభుత్వం కాషాయీకరణ చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేటీకరణ చేస్తూ సామాన్యులకు వైద్యం అందకుండా చేస్తునారు అని అన్నారు. ప్రభుత్వలు ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో రానున్న స్థానిక సంస్థల ఎన్నిలకల్లో పాలక పక్షాలకు తగిన బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనుని హెచ్చరించారు.
నగర కార్యదర్శివర్గ సభ్యులు తాడి పైడయ్య మాట్లాడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి సిపిఐ పక్షాన అనేక పోరాటాలు నిర్వహిస్తున్న పాలకుల స్పందన అంతంత మాత్రంగానే ఉందని. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారం ఉన్న లేకున్నా ఎల్లపుడు ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారమునకు ఎల్లపుడు సిద్ధంగా ఉండేది కేవలం కమ్యూనిస్టులే అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానలకు వ్యతిరేకంగా సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా “మార్పు రావాలి” అనే నినాదంతో ఆగష్టు 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు నగర వ్యాప్తంగా అన్ని డివిజన్ల లో ప్రజా చైతన్య పాదయాత్రలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఈ పాదయాత్రలు జయప్రదం చేసేందుకు కృషి చేయాలనీ విజ్ఞప్తి చేసారు.
ఈ సమావేశంలో డివిజన్ కార్యదర్శి బోరా రామకృష్ణ, 50వ డివిజన్ కార్యదర్శి మోకా దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News