Breaking News

ఇన్నాం భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి… : నెట్టెం రఘురాం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇన్నాం భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం అమరావతి సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ, దశాబ్దాలుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న ఇన్నాం భూముల సమస్యను మానవీయ దృక్పథంతో పరిశీలించి, రైతులకు, భూముల యజమానులకు శాశ్వత న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వ హయాంలో ఈ సమస్య పరిష్కారానికి ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రపతి ఆమోదం పొందిన బిల్లును తీసుకువచ్చినప్పటికీ, 2019 ఎన్నికల ముంగిట ఉండటంతో ఆ బిల్లును చట్ట సవరణ రూపంలో శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేయడం సాధ్యం కాలేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి నెట్టెం రఘురాం గుర్తు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజకీయ కారణాలతో ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లకుండా నిర్లక్ష్యం చేసిందని వివరించారు.

తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన అనంతరం రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, ప్రభుత్వం జి.ఓ. నెం.144ను జారీ చేసిందన్నారు. అయితే, ఇన్నాం భూములను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించకపోవడంతో రైతులు, భూముల యజమానులు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం మరోసారి సమావేశమై సమస్యను సమగ్రంగా పరిశీలించి, ఇన్నాం భూములను 22-ఏ నిషేధిత జాబితా నుంచి పూర్తిగా తొలగించి, భూములపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేలా అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని వినతిపత్రంలో కోరారు. ఈ వినతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులతో సమగ్రంగా పరిశీలించి, రైతులకు న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నెట్టెం రఘురాం తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *