గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో డోర్ టు డోర్ చెత్త నూరు శాతం జరగాలని, రోడ్ల పై చెత్త వేసే వారికి అపరాధ రుసుము విధించాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. మంగళవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో పబ్లిక్ హెల్త్ సెక్షన్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో గార్బేజ్ పాయింట్లు ఉండకూడదని, ప్రజలు రోడ్ల పై మరియు సైడు కాడువల్లో చెత్త వేయకుండా చూడాలని, ఎవరైనా చెత్తను రోడ్ల పై వేస్తే వారికి అపరాధ రుసుము విధించాలని ఆదేశించారు. నగరంలో ఆగష్టు నుండి సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేదిస్తున్నామని, సింగల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్ధాలు ప్రజలకు వివరించి, వారికి అవగాహన కార్యమాలు నిర్వహించాలన్నారు. ప్లాస్టిక్ వాడకం నిషేధాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని, త్వరలోనే దీనిపై స్పెషల్ టాస్క్ ఫోర్క్ ఏర్పాటు చేస్తామని, నిర్దేశిత తేదీ తరువాత సింగల్ యూజ్ ప్లాస్టిక్ వాడే వారికి అపరాధ రుసుములు విస్తామని తెలియచేశారు. అలాగే ప్రధాన డ్రైన్లలోని సిల్ట్ ను తీసిన తరువాత వెంటనే సదరు ప్రాంతం నుండి సిల్ట్ ను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త్వరలోనే గుంటూరు నగరానికి 200 ఈ ఆటోలు రానున్నాయని, సదరు ఆటోల ఏ ఏ డివిజన్ కు ఎన్ని వాహనాలు కేటాయించాలో మరియు ఎన్ని గృహాలకు వాడాలో ప్రతి గృహంలో చెత్త సేకరించేలా మ్యాపింగ్ సిద్దం చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్ లను ఆదేశించారు. ప్రధాన రహదారుల్లో స్వీపింగ్ చేయడానికి స్వీపింగ్ మిషన్లు వినియోగిస్తున్నామని, సదరు మిషన్లు క్లీన్ చేయని రోడ్డు మార్జిన్లను పారిశుధ్య కార్మికుల ద్వారా క్లీనింగ్ చేయించాలన్నారు. హై వే సబ్ వెల పై కూడా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సదరు ప్రాంతాలలో ఎవరూ గార్బేజ్ వేయకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. నగరంలోని ఖాళీ స్తలాలను శుభ్రం చేయించాలని, సదరు ప్రాంతాలలో దోమలు పెరగకుండా యాంటి లార్వ కార్యక్రమాలు చేయాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య కార్మికుల హాజరును యఫ్.ఆర్.యస్ విధానం ద్వారా నే సేకరించాలని, ఈ విధానంలో సమస్యలేమైనా ఉంటె అధికారుల దృష్టికి తీసుకురావాలని, వెంటనే సదరు సమస్యను పరిస్తామని తెలియచేశారు.
సదరు సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు బి. శ్రీనివాసరావు, సాంబశివరావు, సి.య.ఓ.హెచ్ డాక్టర్ శాంతి కళ, యం.హెచ్.ఓ డాక్టర్ సురేష్, శానిటరీ సుపెర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News