Breaking News

నైలెట్ శాశ్వత క్యాంపస్ గురించి పార్లమెంటులో ప్రస్తావన

-శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రతిపాదిత సైబర్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కి ఆమోదం తెలుపండి
-తిరుపతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాటు వేగవంతం చేయండి
-మంగళవారం పార్లమెంటు జీరో అవర్ లో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎంపీ గురుమూర్తి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నైలెట్) శాశ్వత క్యాంపస్, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైబర్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, తిరుపతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాటును తక్షణమే పూర్తి చేయాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లోక్‌సభ జీరో అవర్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

తిరుపతిలో నైలెట్ కేంద్రం ఏర్పాటుకు మొదటి నుంచి ఎంపీ గురుమూర్తి నిరంతర కృషి చేశారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రిని పలుమార్లు కలిసి విజ్ఞప్తులు చేయడంతో పాటు, పార్లమెంటులో కూడా ఈ అంశాన్ని పదేపదే ప్రస్తావించారు. ఆయన కృషి ఫలితంగానే తిరుపతిలో నైలెట్ కేంద్రం ఏర్పాటయింది.

ప్రస్తుతం శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు భూకేటాయింపు, డీపీఆర్ సమర్పణ వంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వం, నైలెట్ సంస్థ మధ్య చర్చల్లో ఉన్నాయని కేంద్రం ఇప్పటికే వెల్లడించిన విషయాన్ని ఎంపీ సభ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి శాశ్వత క్యాంపస్‌ను త్వరగా ఏర్పాటు చేయాలని ఈ సందర్బంగా కోరారు.

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రతిపాదిత సైబర్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని కేంద్ర ప్రభుత్వం తక్షణ ఆమోదం తెలిపి అమలు చర్యలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేంద్రం ఏర్పడితే దేశంలో అత్యాధునిక సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ టెక్నాలజీ పరిశోధనలకు తిరుపతి ప్రధాన కేంద్రంగా ఎదుగుతుందని ఎంపీ పేర్కొన్నారు.

అలాగే, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు అనువైన భూమి ఇప్పటికే గుర్తించినప్పటికీ, ఇప్పటికీ నిర్మాణం ప్రారంభం కాకపోవడం వల్ల గ్రామీణ, పేద విద్యార్థులు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ అంశాలపై ఇటీవల సంబంధిత కేంద్ర మంత్రులను వ్యక్తిగతంగా కలిసి వినతిపత్రాలు సమర్పించిన ఎంపీ గురుమూర్తి, ఇప్పుడు అదే అంశాలను లోక్‌సభ జీరో అవర్‌లో మరోసారి ప్రస్తావిస్తూ తిరుపతి విద్యాాభివృద్ధికి కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. విద్యా రంగంలో తిరుపతిని జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తన ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *