Breaking News

కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం ని మర్యాదపూర్వకంగా కలిసిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఎస్. బేగ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ కేడీసీసీ బ్యాంకు రీజినల్ కార్యాలయంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (KDCC Bank) చైర్మన్ నెట్టెం రఘురాం ని ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఎస్. బేగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయాల అభివృద్ధి, ఆధునీకరణ, ప్రజలకు మరింత మెరుగైన గ్రంథాలయ సేవలు అందించేందుకు అవసరమైన చర్యలపై ఇరువురు చర్చించారు. జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి కేడీసీసీ బ్యాంకు తరఫున సాధ్యమైనంత సహకారం అందించాలని ఎం.ఎస్. బేగ్ కోరగా, విద్యా వికాసానికి, పఠన సంస్కృతి పెంపొందించడానికి గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్న నెట్టెం రఘురాం, గ్రంథాలయాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించడం, యువతకు విజ్ఞాన వనరులను మరింత చేరువ చేయడం ద్వారా సమాజాభివృద్ధికి గ్రంథాలయాలు దోహదపడతాయని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *