-బందరు పోర్టు, మంగినపూడి బీచ్ సహా పారిశ్రామికాభివృద్ధికి అండగా నిలవండి
-కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ప్రతిపాదనలు అందించిన మంత్రి కొల్లు రవీంద్ర
న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా సమగ్రాభివృద్ధికి, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి అండగా నిలిచే మచిలీపట్నం-బంటుమిల్లి రోడ్డు నిర్మాణానికి సహకరించాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ జైరాం గడ్కరీని ఢిల్లీలోని వారి కార్యాలయంలో కలిసి విన్నవించారు. ఈ రోడ్డు నిర్మాణంతో మచిలీపట్నం పోర్టు, మంగినపూడి బీచ్‌కు రోడ్డు కనెక్టివిటీ పెరుగుతుంది. తద్వారా ఈ ప్రాంతంలో పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం అవుతాయి. ప్రధానంగా మచిలీపట్నం పోర్టు అనుసంధానంగా వచ్ే ఇండస్ట్రియల్ కారిడార్స్, లాజిస్టిక్స్ పార్క్స్, ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ కు సానుకూల వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు. సుమారు రూ.150 కోట్ల వ్యయంతో కృష్ణా జిల్లాలోని బందరు పోర్టు నుండి మంగినపూడి బీచ్ మీదుగా బంటుమిల్లి వరకు జాతీయ రహదారి 216కు అనుసంధానించాలని విన్నవించారు. ఈ రోడ్డు మార్గం పూర్తైతే.. అంతరాయం లేని కనెక్టివిటీ లభిస్తుంది. ఎంతో వ్యూహాత్మక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రతిపాదిత రోడ్డు మార్గం మొత్తం ప్రభుత్వ భూమి గుండా వెళుతుండడంతో భూసేకరణ సమస్యలు లేకుండా కొత్త రహదారి నిర్మాణం చేయడానికి ఆస్కారం ఉంది. మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ జాతీయ మరియు అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రధాన ద్వారంగా మారబోతోంది. ఈ రోడ్డు పూర్తైతే.. పోర్ట్ ద్వారా ఎగుమతి దిగుమతులు, కంటైనర్ ట్రాఫిక్, భారీ వాణిజ్య వాహనాలు మరియు లాజిస్టిక్స్ కార్యకలాపాల కదలికలకు సులువు అవుతుంది.
ప్రతిపాదిత రోడ్డు మచిలీపట్నం ప్రాంతంలో రాబోయే ఇండస్ట్రియల్ కారిడార్లు, లాజిస్టిక్స్ పార్కులు, MSME క్లస్టర్‌లు, మత్స్య మౌలిక సదుపాయాలు మరియు అనుబంధ వాణిజ్య సంస్థలకు సమర్థవంతమైన కనెక్టివిటీని అందించగలుగుతుంది. తద్వారా వ్యవసాయ ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు, పారిశ్రామిక వస్తువులు రవాణాను సులభతరం చేస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తైతే కృష్ణా జిల్లా మరియు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుంది. లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షించే మంగినపూడి బీచ్‌కు రోడ్డు సదుపాయం మెరుగవుతుంది. తద్వారా పర్యాటకం పెరిగి.. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆతిథ్యం, వినోదం మరియు ఇతర పర్యాటక కార్యకలాపాలకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. పారిశ్రామిక, పర్యాటక అభివృద్ధిని, ఉద్యోగ ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర అభివృద్ధికి అండగా నిలిచే ఈ రోడ్డు మార్గానికి వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేసి పూర్తి చేయాలని విన్నవించారు.
Prajavartha Online Telugu News