గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో మేజర్, మీడియం డ్రైన్లలో రెండో విడత పూడికతీత పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం నగర పాలక సంస్థలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఇంజనీరింగ్ అధికారులు మరియు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఈ ఏడాది పూడికతీత కాంట్రాక్ట్ నిర్వహణ 90 రోజులు పాటు సదరు కాంట్రాక్టర్ దే భాధ్యత ఉండేలా నిబందనలు పొందుపరిచినందున వారితోనే రెండో విడత పూడికతీత పనులను వెంటనే చేపట్టాలని స్పష్టం చేశారు. పూడికతీత పనులను ప్రతి పాయింట్ లో ఏఈలు, ఎమినిటి కార్యదర్శులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని, లోపాలు గుర్తిస్తే సంబంధిత అధికారులు భాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే కీలకమైన రోడ్ విస్తరణ, అభివృద్ధి పనుల్లో పట్టణ ప్రణాళిక అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పునఃప్రారంభించి, పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాటర్ మీటర్ రీడింగ్స్ పై ప్రతి ఒక్కరూ దృష్టి సారించి, ప్రతి నెల 3వ వారం రీడింగ్స్ తీయాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతి సచివాలయం పరిధిలో త్రాగునీటి సరఫరా సమయంలో 10 శ్యాంపిల్స్ తీసి, సిఎంఎం యాప్ లో అప్ లోడ్ చేయాలని, నిర్లక్ష్యంగా ఉండే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గుర్తించిన ప్రాంతాల్లో డివైడర్ ప్లాంటేషన్ చేపట్టాలని, 15 ఫైనాన్స్ నిధులతో మంజురైన పనులను వెంటనే పూర్తి చేయడానికి పిన్ పాయింట్ షెడ్యూల్ సిద్దం చేయాలని డిఈఈలను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న జిటిఎస్ లపై రోజువారీ నివేదిక ఇవ్వాలని, ఈఈలు ప్రత్యక్ష్య పర్యవేక్షణ చేయలన్నారు.
సమావేశంలో ఎస్ఈ సుందర్రామిరెడ్డి, సిటి ప్లానర్ రాంబాబు, డిసిపి సూరజ్ కుమార్, ఈఈలు విష్ణు, వేణుగోపాల్, డిఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News