-ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం ఎస్ బేగ్,ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. మహాత్మా గాంధీ హోల్ సేల్ కమర్షియల్ కాంప్లెక్స్
శ్రీ షిరిడి సాయిబాబా మందిరము, దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు , పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొని
శ్రీ సాయి బాబా కు ప్రత్యేక పూజలు చేశారు. కాంప్లెక్స్ అధ్యక్షులు పరుచూరి నాగేశ్వరరావు, సెక్రటరీ కాసుల వెంకట నారాయణ పాల్గొన్నారు.
గురు పౌర్ణమి సందర్భంగా చెరువు సెంటర్ ,శ్రీ షిరిడి సాయిబాబా మందిరం (చిన్న సాయిబాబా గుడి) సేవా సంఘం ,ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు.. మాజీ కార్పొరేటర్ మైలవరపు రత్న కుమారి దుర్గారావు , జనసేన పార్టీ కృష్ణా జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి గంజి పవన్, జనసేన నేతలు లింగం శివప్రసాద్,తమ్మిన లీల కరుణాకర్, గన్ను శంకర్, బాదర్ల శివ, శనివారపు శివ, రేలంగి బుజ్జి, దేవకీ తదితరులు పాల్గొన్నారు..
పూర్ణానందంపేట శ్రీ షిర్డి సాయిబాబా ధ్యాన మందిరంలో శ్రీ షిర్డి సాయి సత్సంగ మండలి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం ఎస్ బేగ్ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , టీడీపీ నాయకులు సారిపల్లి రాధ కృష్ణ పాల్గొని సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు ఆకుల బాబురావు, సెక్రటరీ రాయపూడి సత్యనారాయణ, కొమ్మూరి బసవరాజు 35 వ డివిజన్ బీజేపీ ఇన్చార్జ్ డాక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు.
కొత్తపేట,శ్రీ షిర్డి సాయిబాబా మందిరములో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు పట్నాల హరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొని సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు.. విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు అండలూరి శ్రీధర్, చిప్పాడ చందు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News