గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సీలింగ్ భూములు క్రమబద్ధీకరణ ఆర్జీలపై అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 2వ తేదీ లోగా లిఖిత పూర్వకంగా సమర్పించాలని అర్బన్ ల్యాండ్ సీలింగ్ అధికృత అధికారి జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ కోరారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పట్టణ భూ పరిమితుల చట్టము, 1970 ప్రకారము ప్రభుత్వ పరిధిలోకి వచ్చిన సీలింగ్ భూములు, మిగులు భూములు క్రమబద్ధీకరణ చేసుకొనుటకు ప్రభుత్వము జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. సీలింగ్ భూములు క్రమబద్ధీకరణ చేసుకొనే అర్జీదారులు వారి ఆధీనములో వున్న సీలింగ్ భూములను క్రమబద్ధీకరణ చేసుకొనుటకు దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. దాఖలు చేసిన ఆర్జీలను విచారణ చేసి జిల్లా కలెక్టరు మరియు చైర్మన్, జిల్లా స్థాయి పరిశీలనా కమిటీ, అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఆమోదముతో ప్రధాన కమీషనరు, భూ పరిపాలన వారికి పంపడం జరుగుతుందన్నారు. 170 మంది అర్జీదారులు దరఖాస్తులు సమర్పించారని చెప్పారు. అర్జీదారులు దాఖలు చేసిన ఆర్జీల వివరాలను ప్రజల పరిశీలనార్ధము జిల్లా అధికారిక వెబ్ సైట్ www.guntur.ap.gov.in లో పొందుపరచడం జరిగిందన్నారు. అర్జీదారులు దాఖలు చేసిన ఆర్జీల విషయమై ఎవరికైనా ఏదేని అభ్యంతరాలు ఉంటే జాయింట్ కలెక్టరు మరియు అధీకృత అధికారి, అర్బన్ ల్యాండ్ సీలింగ్ కార్యాలయంలో ఆదివారం, ఆగస్టు 2వ తేదీ లోగా లిఖిత పూర్వకంగా సమర్పించాలని కోరారు.
Tags guntur
Check Also
ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు
-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …
Prajavartha Online Telugu News