-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల కాలంలో కాపు కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాల ద్వారా రూ.11,285.72 కోట్లతో 51,56,172 లక్షల మందికి లబ్ధి చేకూర్చినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం శాసనమండలిలో కాపు కార్పొరేషన్ ద్వారా కాపు సామాజిక వర్గీయులకు కూటమి ప్రభుత్వం ఎంతమేర నిధులు కేటాయించారు.. ఎంతమంది లబ్దిదారులకు ప్రయోజనం కల్పించారన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ప్రశ్నపై మంత్రి పైవిధంగా సమాధానమిచ్చారు. కాపు కార్పొరేషన్ కు చైర్మన్ ను నియమించామన్నారు. కాపుల అభివృద్దికి కాపు కార్పొరేషన్ కు ఏటా నిధులు కేటాస్తున్నామన్నారు. కాపుల అభివృద్ధికి కాపు కార్పొరేషన్ ద్వారా వెచ్చించిన వివరాలను బడ్జెట్ల వారీగా వివరించారు. 2024-25లో రూ.4,646.99 కోట్లు కేటాయించగా రూ.4.440.25 కోట్లు వెచ్చించి 9,55,144 మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూర్చామన్నారు. 2025-26లో రూ.4,924.28 కోట్లు కేటాయించగా, రూ.4,360.28 కోట్లతో 20,63,907 మందికి లబ్ధి చేకూర్చామన్నారు. 2026-27లో రూ.5,012.10 కోట్లు కేటాయించగా, నేటి వరకూ రూ.2,485.19 కోట్లతో 21,37,121 మంది కాపులకు ప్రయోజనం చేకూర్చామని మంత్రి సవిత సవిత తెలిపారు.
Prajavartha Online Telugu News