-మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఐఐటీ, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు, అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయంలో గుంటూరు జిల్లా తాడికొండలోని ఐఐటి నీట్ ఎక్సలెన్సీ సెంటర్ లో అదనపు భవనాల నిర్మాణం, విద్యార్థులకు సౌకర్యాల కల్పనపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఐటీ, నీట్ క్యాంపస్ నిర్మాణ నమూనాను మంత్రి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ… క్యాంపస్ లో అదనపు భవనాల నిర్మాణం, అంతర్గత రోడ్లతోపాటు వాకింగ్ ట్రాక్,బ్యాట్మెంటన్ కోర్టు, కోకో కోర్టు, మల్టీపర్పస్ కోర్టు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు ప్రశాంతమైన వాతావరణం ఉండేలా నిర్మాణాలు, ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. పేద విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష అని మంత్రి తెలిపారు. ఐఐటీ నీట్ ఎక్సలెన్సీ సెంటర్ల ద్వారా పేద విద్యార్థులకు బంగారు భవితను అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అన్నారు. ఈ సమీక్షలో APSWREIS కార్యదర్శి IAS వి.ప్రసన్న వెంకటేష్ , AP EW IDC EE అనిల్ కుమార్, గుంటూరు జిల్లా ఎస్సి కార్పొరేషన్ ఈడీ దుర్గా బాయి, APSWREIS డీసీవో తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News