Breaking News

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి పాలన

-సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాం
-దేశానికే ఆదర్శంగా మన రాష్ట్ర సంక్షేమం
-మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి పాలన సాగుతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం అసెంబ్లీలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి పాలన సాగుతోంది. సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాం.
దేశానికే ఆదర్శంగా మన రాష్ట్ర సంక్షేమం నిలుస్తోంది. దేశంలో ఏ రాష్ర్టంలో లేని విధంగా పెద్ద మెత్తంలో ఫించన్లు ఇస్తున్నాం. అన్న క్యాంటీన్లతో పేదలకు రూ. 5 భోజనం పెడుతున్నాం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నాం. పాఠశాలల బలోపేతం, తల్లికి వందనంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్డులు సంఖ్య గనణీయంగా పెరిగింది, స్త్రీ శక్తికి సమర్దవంతంగా అమలు చేస్తున్నాం ఎన్నికల్లో చెప్పకపోయినా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు.

సంక్షేమం, సామాజిక భద్రత:

1. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ నెరవేరిన ఎన్నికల హామీలు

2. తల్లికి వందనం : రూ.20,090 కోట్లు చెల్లింపు, 67.27 లక్షల మంది విద్యార్థులకు సాయం

3. స్త్రీ శక్తి మహిళలకు ఉచితంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రయాణం- 87 కోట్ల ప్రయాణాలు

4. దివ్యాంగ శక్తి: దివ్యాంగులకు ఉచితంగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ప్రయాణం- 6.40 కోట్ల ప్రయాణాలు

5. దీపం 2 పథకం: ఏటా ఉచితంగా 3 సిలిండర్ల పంపిణీ ఇప్పటికి 4.57 కోట్ల సిలిండర్లు.

6. అన్న క్యాంటీన్: రాష్ట్రంలో 269 ఏర్పాటు 10.71 కోట్ల భోజనాలు

7. అన్నదాత సుఖీభవ : 46 లక్షల మంది రైతులకు 4 విడతలు కలిపి రూ.14,664 కోట్లు జమ

8. ఎన్టీఆర్ భరోసా: ఇప్పటివరకు సామాజిక భద్రతా పెన్షన్ల కోసం రూ.71 వేల కోట్లకు పైగా వ్యయం

9. మత్స్యకార సేవలో ఏడాదికి 20 వేల చొప్పున 1.30 లక్షల మందికి రూ.505 కోట్లు

10. ఆటో డ్రైవర్ల సేవలో: ఏడాదికి రూ.15,000… రూ.436 కోట్లు జమ, 2.90 లక్షల మందికి లబ్ది

11. అంగన్ వాడి కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు, బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు, 300 తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్లు ప్రారంభం

12. P4 ద్వారా పేదరిక నిర్మూలన 2 లక్షల బంగారు కుటుంబాలకు మార్గదర్శుల చేయూత

13. 5.5 లక్షల ఇళ్లు పేదలకు అందజేత… మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంకల్పం

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ :

14. మత్స్యకారుల కోసం జీ.వో 217 రద్దు- నీటి వనరులపై హక్కు

15. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపు

16. వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ

17. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు

18. ఈ ఏడాది మైనారిటీ సంక్షేమానికి రూ.3,670 కోట్లు

19. 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనానికి రూ.51 కోట్లు

20. ఇమామ్ కు నెలకు రూ.10,000 మౌజన్లకు రూ.5,000 చొప్పున ఏడాదికి రూ.90 కోట్లు

21. వర్ఫ్ బోర్డు పునరుద్ధరణ- అన్ని వర్గాలకు ప్రాధాన్యం

22. పురోహితులకు నెలకు రూ.15,000కు వేతనాల పెంపు

23. నాయీ బ్రాహ్మణులకు నెలకు రూ.25,000కు వేతనాల పెంపు

24. చేనేతలకు ఉచిత విద్యుత్: నెలకు మగ్గానికి 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు, నేతన్న నేస్తం కింద రూ.25 వేల ఆర్థిక సాయం

25. జూనియర్ లాయర్లకు రూ.10,000 గౌరవ వేతనం

26. 20 లక్షల ఎస్సీ, ఎస్టీల కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్

27. సోలార్ రూఫ్ టాపు బీసీలకు రూ.20 వేల అదనపు సాయం

28. లక్ష మంది మహిళా పారిశ్రామిక వేత్తలు మరో 5 లక్షల మంది లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు.

నియామకాలు, ఉద్యోగుల సంక్షేమం :

29. మెగా డీయస్సీ రిక్రూట్మెంట్… ముఖ్యమంత్రి తొలి సంతకం, 15,941 టీచర్ పోస్టుల భర్తీ

30. 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకాలు పూర్తి, రూ.4,500 నుంచి రూ.12,500కు స్టైఫండ్ పెంపు

31. ప్రభుత్వ ఉద్యోగులకు రెండేళ్లలో రూ.30 వేల కోట్ల బకాయిలు చెల్లింపులు చేశామన్నారు.

సీఎం చంద్రబాబుకు మంచి పేరొస్తుందన్న కుట్రతో అమరావతిని జగన్ విధ్వంసం చేయాలని చూశారు. మెక్కవోని దీక్షతో సీఎం చంద్రబాబు అమరావతి నిర్మిస్తున్నారు. విశాఖకు రైల్వే జోన్ తెచ్చాం, చెప్పిన మాట ప్రకారం మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేశామని, వెలుగొండ పూర్తి చేసి ఈ నెలలోనే నీళ్లిస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *