Breaking News

విశాఖపట్నం లిటిల్ గార్డెన్ స్కూల్ ఘటనపై పాఠశాల విద్యాశాఖ తీవ్ర దిగ్భ్రాంతి

-ముగ్గురు సభ్యుల కమిటీ విచారణకు ఆదేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖపట్నంలోని లిటిల్ గార్డెన్ స్కూల్‌లో మైనర్ విద్యార్థి మృతి చెందిన ఘటన అత్యంత దురదృష్టకరం మరియు బాధాకరం. ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తోంది.
ఘటన జరిగిన వెంటనే సంబంధిత విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టి ప్రాథమిక నివేదికను సమర్పించారు. ఆ ప్రాథమిక నివేదిక ఆధారంగా వాస్తవాలను సమగ్రంగా పరిశీలించేందుకు త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో విశాఖపట్నం రీజినల్ జాయింట్ డైరెక్టర్ (RJD), జిల్లా విద్యాశాఖాధికారి (DEO), మరియు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO) సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా, విద్యార్థులతో ఉపాధ్యాయులు సున్నితంగా, బాధ్యతాయుతంగా మరియు మానవతా దృక్పథంతో వ్యవహరించేలా అవసరమైన సెన్సిటైజేషన్ కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాము. విద్యార్థుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. త్రీమెన్ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి తగిన చర్యలు తీసుకోబడతాయని తెలియజేయడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *