విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఏ సూర్య కుమారి జువినైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అమలు చేస్తున్న జువినైల్ జస్టిస్ యాక్ట్ పై సమీక్షా నిర్వహించారు. ఈ యాక్ట్ ఏర్పాటై 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా సెప్టెంబర్ 5న నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి జువినైల్ జస్టిస్ కమిటీ మీటింగ్ కు ఈరోజు విద్యాశాఖ, ఆరోగ్యశాఖ, పోలీస్ శాఖ, జిల్లా బాలల సంరక్షణ విభాగాలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జువినైల్ జస్టిస్ బోర్డు మరియు వివిధ శాఖలతో సమీక్షా నిర్వహించడం జరిగింది. ఈ 10 సంవత్సరాలలో యాక్ట్ అమలు చేస్తున్నా కార్యక్రమాలు శాఖలావారీగా వివరించారు. అదేవిధంగా సమర్థవంతంగా అమలుచేయుటకు అన్ని శాఖలనుండి సూచనలు మరియు సలహాలు తీసుకున్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ యమ్ వేణుగోపాల్ రెడ్డి, జువినైల్ వెల్ఫేర్ డైరెక్టర్ వసంత బాల, మిషన్ వాత్సల్య జాయింట్ డైరెక్టర్ శిరీష, ఏసీపీ దైవ ప్రసాద్,యూనిసెఫ్ ప్రతినిధులు, డీపీఓలు, డీసీపీవో లు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్పర్సన్ లు, మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News