వ్యాధి నిరోధక కార్యక్రమాల్లో సుబ్రమణ్యేశ్వరి సేవలు ప్రశంసనీయం

-రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ చక్రధర్ బాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లో దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణకు అడిషనల్ డైరెక్టర్‌గా సుబ్రమణ్యేశ్వరి అందిoచిన సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ చక్రధర్ బాబు
కొనియాడారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో పనిచేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా, జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌ (JE), మెలియోయిడోసిస్‌ వంటి వ్యాధుల నియంత్రణకు సుబ్రమణ్యేశ్వరి తీవ్రoగా కృషి చేశారని పేర్కొన్నారు. పదవీ విరమణ సందర్భంగా విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయoలో సోమవారం జరిగిన వీడ్కోలు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన చక్రధర్ బాబు మాట్లాడుతూ..మహిళలు ఉద్యోగ రంగంలో రాణించేందుకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సహకారం ఎంతో అవసరమని పేర్కొంటూ సుబ్రమణ్యేశ్వరి కుటుంబ సభ్యులను కూడా అభినందించారు. ఉద్యోగ పదవీ విరమణ ఉద్యోగ జీవితంలో సహజమైన ప్రక్రియ అయినప్పటికీ, సుబ్రమణ్యేశ్వరి సేవలను, సాన్నిహిత్యాన్ని డిపార్ట్‌మెంట్ తప్పక మిస్ అవుతుందని సహచర అధికారులు పేర్కొంటూ, ఆమెకు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాధుల నియంత్రణలో కంటైన్‌మెంట్, సర్వైలెన్స్, సమర్థవంతమైన చికిత్సా విధానాలు కీలకమని, ప్రజలు కూడా స్వీయ సంరక్షణతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. విధుల నిర్వహణలో
సహకరిoచిన అందరికీ సుబ్రమణ్యేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పద్మావతి, ఇతర రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నతస్థాయి అధికారులు (NHM) విజయలక్ష్మి, డి.ప్రకాష్ రావు, బీవీ రావు, అర్జునరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *