రేపు మొగల్తూరుకు సీఎం చంద్రబాబు

-పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో పర్యటించనున్నారు. ఉదయం 9.45 గంటలకు అమరావతి నుంచి బయల్దేరి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకు చేరుకోనున్నారు. 11 గంటలకు నర్సాపురం చేరుకుని గోదావరి గట్టు సమీపంలోని 2,3 వార్డులతో పాటు పొన్నపల్లి లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయనున్నారు. పెన్షన్ లబ్దిదారులతో మాట్లాడనున్నారు. అనంతరం మొగల్తూరు ప్రజావేదిక సభకు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ కేడర్ సమావేశంలోనూ ముఖ్యమంత్రి పాల్గోనున్నారు. సాయంత్రం 5.20 గంటలకు సీఎం అమరావతికి చేరుకోనున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *