సాహిత్య దిగ్గజం గురుజాడ అప్పారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనందరి కర్తవ్యం: మంత్రి కందుల దుర్గేష్

-మహాకవి గురుజాడ అప్పారావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు సాహిత్య దిగ్గజం, అభ్యుదయవాది, సంఘ సంస్కర్త మహాకవి గురుజాడ అప్పారావు జయంతిని రాష్ట్ర పండుగగా అధికారికంగా జరుపుకోవడం ఎంతో సంతోషదాయకమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సోమవారం మహాకవి గురుజాడ జయంతి సందర్భంగా ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ… “దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్” అంటూ తెలుగు జాతికి అభ్యుదయ భావాలను, విశాల దృక్పథాన్ని అందించిన మహనీయుడు గురుజాడ అని కొనియాడారు. ‘కన్యాశుల్కం’ వంటి నాటకం ద్వారా ఆనాడు సాంఘిక దురాచారాలపై ధైర్యంగా గళం విప్పి, సంఘ సంస్కరణకు బాటలు వేసిన ఆయన ఆశయాలు నేటి తరానికి ఎప్పటికీ ఆదర్శప్రాయమని తెలిపారు. మహాకవి గురుజాడ వారసులకు గతంలో నిలిచిపోయిన గౌరవ వేతనాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునరుద్ధరించిందని, ఆ మహోన్నత మూర్తిని ప్రభుత్వం సగౌరవంగా స్మరించుకుంటోందని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ఇది కూటమి ప్రభుత్వానికి సాహిత్య, సాంస్కృతిక రంగాల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిలువెత్తు తార్కాణమని తెలిపారు. అటువంటి మహాకవి ఆశయాలను, ఆయన చూపిన మార్గాన్ని ముందుకు తీసుకెళ్లడమే మనందరి కర్తవ్యమని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *