Breaking News

నగరపాలక సంస్థ అభివృద్ధికి ప్రజలు సహకరించాలి – అందరి సహకారంతో నగరాభివృద్దికి కృషి…

-నూతన కమీషనర్ గా భాద్యతలు స్వీకరించిన స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్.

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పరిస్థితులపై అవగాహన ఉందని, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి ప్రజల సహకారంతో నగరాభివృద్దికి కృషి చేస్తానని, నూతన కమీషనర్ గా భాద్యతలు చేపట్టిన  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమీషనర్ ఛాంబర్ నoదు నూతన కమీషనర్ గా స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ నేడు భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంలో విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్ గా నియమించుట పట్ల ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేసారు. విజయవాడతో నాకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని, గతంలో గుంటూరు జాయింట్ కలెక్టర్, నూజివీడు సబ్ కలెక్టర్ గా కూడా తాను విధులు నిర్వర్తించానని, కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ గా విధులు నిర్వహించి ఇక్కడకు బదిలీ అయినట్లు తెలిపారు నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు ఎదుర్కోను సమస్యల పరిష్కారానికై ప్రణాళిక ప్రకారం అందరి సహకారంతో, సమన్వయముతో పని చేస్తూ, నగరాన్ని అభివృద్ధి పధంలో నిలుపుటకు కృషి చేస్తానని అన్నారు. తొలుత నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, అన్ని విభాగముల అధిపతులతో కలసి నూతన కమిషనర్ కి స్వాగతం పలికి ఒకరినొకరు పరిచయం చేసుకోనారు. నగరపాలక సంస్థ నందు కమిషనరుగా భాద్యతలు స్వీకరించిన తదుపరి మేయర్ రాయన భాగ్యలక్ష్మి ని మర్యాద పూర్వకంగా కలిసి నగరాభివృద్ధిపై చర్చించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *