విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (జనరల్)గా యం.శామల మరియు అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్)గా కె.వి సత్యవతి మంగళవారం భాద్యతల స్వీకరించారు. నగరపాలక సంస్థ అదనపు బీమవరం కమిషనర్ గా భాద్యతలు నిర్వహిస్తూన్న యం.శామల, MPDO, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (జనరల్) గాను ఇక్కడ విధులు నిర్వహిస్తున్న డా.జె అరుణ చిత్తూరు కమీషనర్ గా బదిలీ చేసారు. అదే విధంగా అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్)గా 2007 బ్యాచ్ కు చెందినా గ్రూప్ -1 అధికారి శ్రీమతి కె.వి సత్యవతి, భాద్యతలు స్వీకరించారు. గతంలో విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఆడిట్ అధికారిగా విధులు నిర్వహిస్తూ, సర్వక్షిణ అభ్యన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అధికారిగా గుంటూరు నందు విధులు నిర్వహించారు.
Prajavartha Online Telugu News