Breaking News

32 మంది స్పెషల్ ఆఫీసుర్లకు భాద్యతలు అప్పగింత…

-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ మంగళవారం తన ఛాంబర్ నందు అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేసారు. ఈ సమవేశంలో నగర పరిధిలోని 64 డివిజన్ లకు సంబందించి 32 మంది ప్రత్యేక అధికారులుగా భాద్యతలను అప్పగిస్తూ, వారికీ కేటాయించిన రెండు వార్డ్ లలో పారిశుధ్య నిర్వహణ విధానమును ప్రతి రోజు ఉదయం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అదే విధంగా వారి డివిజన్ లలో గల అన్ని సచివాలయాల యొక్క నిర్వహణ విధానము, సిబ్బంది పని తీరు మొదలగు అన్ని అంశాలపై స్పెషల్ అధికారులకు భాద్యతలను అప్పగిస్తూ, స్వచ్చ్ సర్వేక్షణ్ 2022 లో విజయవాడ నగర ఉత్తమ ర్యాంక్ సాదించే దిశగా ప్రతి ఒక్కరు సమిష్టి కృషి చేయాలని అన్నారు. అదే విధంగా డివిజన్ పరిధిలోని అన్ని రకాల పన్నుల వసూలు, యూజర్ చార్జీలు వంటి అన్ని అంశాలతో పాటుగా నగరపాలక సంస్థ ద్వారా చేపట్టి అన్ని కార్యక్రమములపై పూర్తి స్థాయిలో భాద్యత వహించాలని అన్నారు. డివిజన్ పరిధిలోని అభివృద్ధి పనుల యొక్క పురోగతి పై కూడా దృష్టి సారించాలని, ప్రతి రోజు టెలికాన్ఫరెన్సు ద్వారా డివిజన్ల పారిశుధ్య నిర్వహణ ఇంటింటి చెత్త సేకరణ, అభివృద్ధి కార్యక్రమాల యొక్క పురోగతి, సచివాలయాల నిర్వహణ వంటి అంశాలపై అధికారులతో సమిక్షి నిర్వహిస్తానని తెలియజేసారు. స్పెషల్ ఆఫీసర్ గా భాద్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరు ఇతర అధికారులు మరియు సిబ్బందిని సమన్వయము చేసుకొని భాద్యతగా మీకు కేటాయించిన విధులను సక్రమముగా నిర్వహిస్తూ, నగర అభివృద్ధికి కృషి చేయాలని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *