Breaking News

‘‘క్విట్ జగన్..సేవ్ ఆంధ్రప్రదేశ్’’… : నెట్టెం రఘురాం

-క్విట్ జగన్-సేవ్ ఆంధ్రప్రదేశ్.. జగన్‌రెడ్డి ప్రభుత్వాన్ని విడిచిపెట్టి రాష్ట్రాన్ని రక్షిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు
-వైసీపీ ప్రభుత్వ మూడేళ్ల పాలనలో వారి అవినీతి, దాష్టీకాలకు లక్ష 25వేల మంది సామాన్యులు బలి
-ఎమ్మెల్యే గద్దె రామమోహన్
-జగన్‌రెడ్డి జే-బ్రాండ్ మద్యంతాగి రాష్ట్రంలో లక్షలాది మంది మృత్యువునకు చేరువైన పరిస్థితి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఆటోనగర్‌లోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ ఈ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఎదురుచూస్తున్న పరిస్థితి, ‘‘క్విట్ జగన్..సేవ్ ఆంధ్రప్రదేశ్’’ ఇది మా స్లోగన్.. నేటి జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విడిచిపెడదామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షిద్దామని తెలుగుదేశం పార్టీ తరపున ప్రజలందరికీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న నడుస్తున్న చరిత్ర అందరికీ తెలుసు రాష్ట్రం అథోగతి పాలవుతున్నది, చరిత్రలో ఎన్నడూ లేనంతగా దివాళా తీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి, అరాచకం ప్రబలిపోతున్నది, వ్యవస్థలన్నీ కూడా నాశనమైపోతున్నాయి, వైసీపీ నేతల నిర్లక్ష్యానికి, అవినీతికి, దాష్టీకాలకు జగన్‌రెడ్డి మూడేళ్ల పాలనలో 1,24,793 మంది సామాన్యులు బలయ్యారు. గతంలో 1942లో ఆనాడు బ్రిటీష్ వారు ఈ దేశాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారనే కారణంగా నాడు క్విట్ ఇండియా ఉద్యమం వచ్చిందని గుర్తుచేశారు, స్వాతంత్య్ర అనంతరం కూడా మనం రాజ్యాంగాన్ని రచించుకుని, ఒక చట్టబద్ధమైన పరిపాలనను ఏర్పాటుచేసుకుని ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తున్నాము, కానీ మన రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా అరాచకం ప్రబలిపోతున్నది, ప్రజల సంపద యావత్తు అంతా దోచుకోబడుతుంది. సంక్షేమం పేరు మీద ప్రజలకు కేవలం ఓట్ల కోసం పందేరం చేస్తున్నట్లుగా కనపడుతుందే తప్ప ప్రజల యొక్క ప్రయోజనం కోసం, వారికి ఆదాయమార్గాలు ఏర్పాటుచేసే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగట్లేదు, అభివృద్ధి అనేది శూన్యంగా వుంది, గత తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మరలా రివర్స్ పేరు మీద వెనక్కి తీసుకెళ్తున్నారే ఎక్కడా ముందుకెళ్లే పరిస్థితి రాష్ట్రంలో లేదు, మరో ప్రక్క ప్రభుత్వ ఖజానా యావత్తు సంక్షేమ పేరు మీద లూటీ చేస్తున్నారు. ఒక ప్రక్కన ఇస్తూ మద్య రూపేనా, ఇసుక రూపేనా గాని ఇంకా అనేక రూపాలుగా మళ్లీ వెనక్కి తీసుకుంటున్నారు, చట్టాల్ని, కోర్టుల్ని అపహాస్యం చేస్తున్నారు, కోర్టుల ప్రతిష్ట మసకబారేలా విమర్శిస్తున్నారు. పోలీసుల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిని, ప్రతిపక్ష నాయకుల్ని, కార్యకర్తల్ని, అక్కడక్కడా వైసీపీ పార్టీ వాళ్లే భరించలేని స్థితిలో ఎదురుతతిరిగితే వాళ్లని కూడా ఈ రోజున కర్కశంగా బలిచేసే పరిస్థితి రాష్ట్రంలో వుందన్నారు.

ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని ప్రాంతాలు ప్రాంతాలను వల్లకాడులగా తయారుచేస్తున్నారు, గొడ్డలి వేటుని గుండెపోటుగా మార్చగల శక్తివంతులున్న ప్రభుత్వమిది, అసలైన నిందితులు తప్పించుకునేలా చేసిన నేరాల గల పార్టీ వైఎస్సార్‌సీపీ, పోలీసు వ్యవస్థని పటిష్టపరచాల్సింది పోయి పోలీసు వ్యవస్థనే రాష్ట్రంలో నిర్వీర్యంచేశారు. వైసీపీ ప్రభుత్వ నేతల దాష్టీకాలకు రాష్ట్రంలో మూడేళ్లలో 1 లక్షా 25వేల మంది బలైన సామాన్యులే కాకుండా జగన్ జె బ్రాండ్ మద్యాన్ని సేవించి రాష్ట్రంలో లక్షలాది మంది మృత్యువకు చేరువైన పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు.

ఈ విలేఖరుల సమావేశంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి చెన్నుపాటి గాంధి, ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు లింగమనేని శివరామకృష్ణప్రసాద్, సివిల్ సప్ల్సై మాజీ డైరెక్టర్ లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్‌లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *