నగరంలో “షికారు” చిత్ర యూనిట్ సందడి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బెజవాడలో షికారు సినిమా హీరోయిన్ సాయి దంసిక సందడి చేశారు. బుధవారం హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో చిత్ర యూనిట్ తో జరిగిన విలేకరుల సమావేశంలో షికారు సినిమా దర్శకులు కొలగాని హరి మాట్లాడుతూ శ్రీసత్యసాయి బాబా వారి ఆశీస్సులతో శ్రీ సాయి లక్ష్మీ క్రియోషన్స్ బ్యానర్లో వాగేశ్వరి (పద్మ) సమర్పణలో పి.ఎస్.ఆర్. కుమార్ (బాబ్జీ, వైజాగ్) నిర్మాతగా హరి కొలగాని దర్శకత్వంలో రూపొందించిన “షికారు” సినిమా ఈనెల జూన్ 24 న ప్రేక్షకుల ముందుకు వస్తుందని అన్నారు. హీరోయిన్ గా నటించిన సాయి దంసిక తమిళ్, కన్నడ బాషల్లో 25 పైగా సినిమాలు నటించారని తెలిపారు. ధీరజ్, అభినవ్, నలుగురు కుర్రోళ్ళు హీరోలుగా నటించారని తెలిపారు. పోసాని వంటి సీనియర్ నటులు నటించారని అని అన్నారు. యుట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. వైజాగ్ నుండి‌ రాజమండ్రి, కాకినాడ, విజయవాడ‌ వరకు షికారు టీం షికారు చేస్తున్నారని తెలిపారు. కామెడి ప్రధానం గా సాగే ఈ చిత్రం ఆధ్యతం మంచి వినోదాన్ని అందిస్తుందని తెలిపారు. నిర్మాత బాబ్జీ కు కృతజ్ఞతలు తెలిపారు. మొదటి సినిమా అయినా చాలా బాగా వచ్చిందన్నారు. జూన్ 24న ఆంధ్రప్రదేశ్ మొత్తం విడుదల చేస్తున్నామని ఆందరూ ఆదరించాలని కోరారు. ఈ సినిమా మన చుట్టుప్రక్కల జరిగే  సన్నివేశాలు గుర్తుకు వస్తాయని అన్నారు.
సినిమా హీరోయిన్ సాయి దంసిక మాట్లాడుతూ షికారు ఎంటర్టైనర్ సినిమా అన్నారు. షికారుకి మంచి పేరు వస్తుందని అన్నారు. దేవిక పేరుతో అమాయకమైన పల్లేటూరి అమ్మయిగా నటిస్తున్నాని అన్నారు. జూన్ 24 న రిలీజ్ అవుతుంది. హరి అరుంధతి చేశారని తెలిపారు. ఓక్కో సీన్ కి మంచి ఏంటర్టైనర్ మూవీగా ఉంటందని అన్నారు. ధీరజ్, షార్ట్ ఫిల్మ్ చేశారని తెలిపారు. కన్నడ కిషోర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రోడ్యూసర్స్ మంచి కో ఆపరేషన్ ఇచ్చారని తెలిపారు. శైలు క్యాస్టుమ్ చేశారని తెలిపారు. ఈ చిత్రంలో తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, ధీరజ్ ఆత్రేయ, నవకాంత్, కన్నడ కిషోర్, పోసాని కృష్ణమురళి, చమ్మక్ చంద్ర, గాయత్రి రెడ్డి తదితరులు నటించారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎ.బి.ఈవేంట్స్ బాజి నిర్వహించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *