Breaking News

వైసీపీ ప్రభుత్వ హయాంలో శరవేగంగా అభివృద్ధి పనులు పూర్తి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదలుపెట్టిన ప్రతి పనిని శరవేగంగా పూర్తి చేస్తూ అభివృద్ధి లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. *శనివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ ఎన్టీర్ కాలనీ లో దాదాపు 10 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో సీసీ రోడ్డు స్థానిక డివిజన్ ఇన్ ఛార్జ్ గల్లా పద్మావతి తో కలిసి శంకుస్థాపన చేసారు. *అవినాష్ మాట్లాడుతూ ఇదే డివిజన్ లో దాదాపు కోటి 20లక్షల రూపాయల నిధులతో నిర్మాణలు పూర్తి చేసుకున్న పలు రోడ్లు ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులో కి తీసుకొచ్చాం అని అన్నారు .4వ డివిజన్లో ఉన్న అన్ని కాలనీ లలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ళ కాలంలో ముఖ్యమంత్రి  చొరవతో విజయవాడ నగరంలో ఏ డివిజన్లో లేని విదంగా 4వ డివిజన్ లోనే దాదాపు 9కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ,కార్పొరేటర్ ఉండి కూడా గత 5 సంవత్సరాలు ఈ డివిజిన్ అభివృద్ధి ని పట్టించుకోలేదు, ఇప్పుడు వచ్చి వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసిన పనుల వద్ద ఫోటోలు దిగి వారి ఘనత గా ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటు అని విమర్శించారు. ప్రజలు అంత గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో మీకు గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జగన్ రాష్ట్రం అంత సమ అభివృద్ధి చెందలని ఓడిపోయిన సరే తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసారని,రాబోయే 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి గా ఉండాలని ప్రజలు అంత కోరుకొంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్టీర్ కాలనీ ప్రెసిడెంట్ సుంకర రాజేష్, ఐలా ఛైర్మెన్ సుబ్యకర సుంకర దుర్గా ప్రసాద్,కాలనీ పెద్దలు నల్లూరి సుబ్బారావు, విజయకుమార్, చౌదరి, శ్రీనివాస్, రామకోటేశ్వర రావు, జాస్తి ప్రసాద్ వైస్సార్సీపీ నాయకులు గల్లా రవి, తరుణ్, జె.జె సింగ్, పెద్దిరాజు, వనిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *