సింగపూర్ లో ప్రారంభమైన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు సింగపూర్ లోని సివిల్ సర్వీస్ క్లబ్ టేసన్ సోన్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కే.ఎస్. జవహర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సినిమా, రాజకీయ రంగాలలో అన్న ఘనవిజయాలు, తెలుగు వారికి అయన చేసిన సేవ గుర్తు చేసుకొని సభికులు ఆనందించారు. యావత్ సభా ప్రాంగణం జోహార్ ఎన్టీఆర్ అనే నినాదంతో మారుమ్రోగింది. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ప్రభుత్వ దారుణాలు, దిగజారిపోయిన రాష్ట్ర ఆర్థిక, సామాజిక పరిస్థితులపై ఇక్కడి ప్రవాసులు ఆందోళన వ్యక్తం చేసారు. వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి రావాలని, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యం ఇవ్వగలిగిన నేర్పు, సత్తా చంద్రబాబు నాయుడికే ఉందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని, రెండు రాష్ట్రాల్లో ప్రజలు బాగుండాలని వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *