Breaking News

సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్ నందలి మిగిలిన అన్ని పనులను పూర్తి చేయాలి…

-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ గాంధీనగర్ సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్ ఆధునీకరణ మరియు గ్రీనరీ అభివృద్ధి పనులను పర్యవేక్షించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. స్విమ్మింగ్ పూల్ కాంపౌండ్ వాల్ ఎత్తు పెంచుటతో పాటుగా గోడలు అంచుల వెంబడి ఎత్తుగా పెరుగే మొక్కలు నాటాలని సంబందిత అధికారులను ఆదేశించారు. స్విమ్మింగ్ పూల్ నందలి జిమ్ బిల్డింగ్ కి పెయింటింగ్ వేయించి లోపల వేలాడుతున్న విద్యుత్ వైర్లు సరిచేయాలని సూచించారు. స్విమ్మింగ్ పూల్ నందు DO’s / Don’ts సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని మరియు త్రాగునీటి కొరకు ఆర్.ఓ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోనుటతో పాటుగా ఎంట్రన్స్ గేటు వద్ద అడ్డంగా ఉన్న పోల్స్ తొలగించుటకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జీ.ఎస్ రాజు రోడ్ సెంట్రల్ డివైడర్ నందలి గ్రీనరీ అస్తవ్యస్తంగా ఉండుట గమనించి ట్రిమ్మింగ్ చేసి గ్రీనరీ పెంపొందించుటకు చర్యలు తీసుకోవాలని ఉద్యానవన అధికారులకు సూచించారు. జింఖానా గ్రౌండ్ కాంపౌండ్ వాల్ నిర్మించుటకు అవసరమగు అంచనాలు రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. పై పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, సూపరింటిoడెండింగ్ ఇంజనీర్ (వర్క్స్) పి.వి.కె భాస్కర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.శ్రీనివాస్, ఉద్యానవన అధికారి శ్రీనివాస్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాలు.. ఈదురు గాలులు.. విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి

-ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి -ఉత్తరాంధ్రకు ఎస్పీడీసీఎల్ నుంచి అదనపు సిబ్బంది -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *